NTV Telugu Site icon

TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు సైబరాబాద్‌ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇంతకీ రోహిత్‌ రెడ్డి చేసిన ఫిర్యాదు ఏంటి? అనే విషయాలను పరిశీలిస్తే.. రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌పై కేసులు పెట్టారు.. 120 బీ, 171బీ ఆర్‌/డబ్ల్యూ, 171 ఈ, 506 ఆర్‌/డబ్ల్యూ, 34 ఐపీసీ మరియు Sec 8 of Prevention of corruption Act-1988 సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు..

Read Also: TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌..

బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయల డీల్‌ నడిసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో డీలింగ్ నడిచినట్లు పేర్కొన్న యాన.. స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.. డీలింగ్‌లో భాగంగానే తన ఫామ్ హౌస్ కు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు, ఇతర ఆధారాలను కూడా సేకరించారు.. రాత్రే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.. మొయినాబాద్ ఫామ్‌లోనే సతీష్‌ను విచారిస్తున్నారు పోలీసులు.. ఫరీదాబాద్ చెందిన సతీష్ ను ఫామ్‌హౌస్‌లోనే ఉంచి విచారిస్తున్నట్టుగా సమాచారం.. తిరుపతికి చెందిన సింహ యాజులు, నందులను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రశనిస్తున్నారని తెలుస్తోంది.. ఇవాళ సాయంత్రంలోగా ముగ్గురిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. మొత్తంగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Show comments