NTV Telugu Site icon

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్‌ వ్యాఖ్యలు..!

Balka Suman

Balka Suman

టి.పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై స్పందించారు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు.. మరి.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండ్ గా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఈటల రాజేందర్ ను తీసుకెళ్లి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క కేసీఆర్‌ పెంచుకున్నాడన్న సుమన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఆయన అంటూ ఫైర్ అయ్యారు.. ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించారని.. ఆ కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు ఈటల వెంబడే ఉన్నారంటూ మండిపడ్డారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ ప్రజల నడ్డి విరుస్తుంది అంటివి కదా రాజేందర్ అన్న…? నీకన్న పార్టీలో సీనియర్లు కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్ రావులు ఉన్నారు.. వారు ఎప్పుడు పదవుల కోసం ఆలోంచిచలేదు.. కానీ, ఈటల అన్ని పదవులు అనుభవించారని.. గుర్తుచేశారు బాల్క సుమన్.. నన్ను బానిస సుమన్ అంటున్నారు.. నేను ప్రజలకు బానిసను.. నా పార్టీకి కట్టు బానిసను.. అవును గర్వంగా చెప్పుకుంటున్నా అన్నారు సుమన్… బీజేపీ చెప్పే అబద్దాలకు, టీఆర్ఎస్‌ కు మధ్యే ఇక్కడ పోటీ ఉండబోతోంది.. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచే పార్టీ బీజేపీ అని మండిపడ్డారు.. సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలు చేయడంలో బీజేపీ దిట్టా అని ఆరోపించిన సుమన్.. వాటిని తిప్పి కొట్టడంలో మన అందరం ముందు ఉండాలన్నారు.. 2001నుండి కమలాపూర్ నియోజక వర్గం గులాబీ కంచు కోట… ఇప్పుడు కూడ గులాబీ కంచు కోటా లాగే ఉండాలి. కాషాయ మయం కానివ్వొద్దు అన్నారు.