TRS MLA Aruri Ramesh said that the pud poisoning incident in Vardhannapet school is not a big issue: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా వుండంటతో.. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించారు. సోమవారం రాత్రి భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు. ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. యాజమాన్యం వర్ధన్నపేట ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలియగానే ఎమ్మెల్యే అరూరి రమేష్ హాస్పిటల్ కి వచ్చి విద్యార్థులను పరామర్శించారు.
ఈఘటనపై ఆయన మాట్లాడిని మాటలు ఇప్పుడు సంచళనంగా మారాయి. వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజన్ ఘటన పెద్ద ఇష్యూనే కాదని అనండం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. పాఠశాల విద్యార్థులు ఒకరిని చూసి మరొకరు భయపడ్డారని, పిల్లల్ని తాను కలిశానని, ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. అయితే.. ఒక అమ్మాయికి మాత్రం ఆస్తమా ఉండటంతో కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నారు. మరి కొందరు విద్యార్ధినీలు నోట్లో వేలు వేసుకుని వాంతులు చేసుకున్నారని అన్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కామెంట్స్ పై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా.. పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్ కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తారని హాస్టల్ కు పంపితే తమ పిల్లలను ఆసుపత్రికి పంపారని వాపోయారు. పిల్లల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిన్న రాత్రి బల్లి పడిన ఆహారాన్ని తిని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే.
Suresh Raina: బాంబ్ పేల్చిన రైనా.. ఐపీఎల్‌కు గుడ్ బై