వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య యుద్ధమే నడుస్తోంది.. వారిపై వీరు.. వీరిపై వారు.. అన్నట్టుంగా ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. ఇక, కేంద్రం తీరుపై పార్లమెంట్ వేదికగా పోటారానికి సిద్ధం అయ్యింది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తొలిరోజే.. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలోనూ ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించాలని పట్టుబడుతోంది..
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్యాంప్ పాలిటిక్స్ షురూ..!
దీనికోసం.. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉందని.. రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు నోటీసు ఇస్తే.. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధాంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వియాదా తీర్మానం నోటీసు ఇచ్చారు ఎంపీ నామా నాగేశ్వరరావు.
