Trs foundation day: ఊరు.. వాడ.. గులాబీ జెండాల రెపరెపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా జెండా పండగ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో ముందంజలో నిలిపారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 80 వేల ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించడం దేశ చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు.
అటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 40 అడుగుల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యమం నుంచి పాలన వరకు ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో భాగస్వామ్యం కావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు
Also Read
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్‌పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
అటు టీఆర్ఎస్ ప్లీనరీకి అధికార పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీమయంగా తయారైంది. రోడ్డుపొడవునా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 60 లక్షలకు పైగా కార్యకర్తలున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు వేల మంది ముఖ్యులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల కల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్లీనరీకి చేరుకోనున్నారు. మొత్తంగా 6 వేల మందికి సరిపడా ఏర్పాట్లతో ఇప్పటికే హైటెక్స్ ప్రాణంగం సిద్ధమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్లీనరీ కొనసాగనుండటంతో వేసవి దృష్ట్యా 50 వేల వాటార్ బాటిళ్లతో పాటు ఈసారి ప్రత్యేకంగా అంబలిని అందరికీ అందించేలా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ప్లీనరికీ వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ముందుగానే అందరికీ పాసులు ఇవ్వడంతో పాస్ ఉన్నవారినే లోపలకు అనుమతిస్తున్నారు.
Hyderabad: గమనిక.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నేడు ట్రాఫిక్ ఆంక్షలు
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!