కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే పరిస్థితులు పూర్తి అదుపులోకి రావడంతో కాసేపట్లో సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
రాత్రి 7.40కి లింగంపల్లి-కాకినాడ ట్రైన్ బయల్దేరనుంది. అలాగే రాత్రి 8.20 గంటలకు విశాఖ-గరీబ్ రథ్ రైలు బయలుదేరనుంది. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ ఆందోళనల నేపథ్యంలో నిలిపివేసిన హైదరాబాద్ మెట్రోల సేవలు కూడా పునఃప్రారంభమయ్యాయి. అయితే ఉదయం నుంచి ఎంఎంటీఎస్, మెట్రో సేవలు రద్దు కావడంతో.. హైదరాబాద్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయించడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి.