Trains Rush: సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్.. ప్రత్యేక రైళ్ల కోసం పెరుగుతున్న డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trains Rush: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పెద్ద పండుగ. ఉపాధి కోసం ఇళ్లు వదిలి పట్టణాల్లో బతుకుతున్న చాలా మంది పండుగకు స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి అధిక సంఖ్యలో తరలి వస్తారు. అయితే.. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఏ రైలు చూసినా వందలాది మంది వెయిటింగ్ లిస్ట్. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి ప్రాంతాలకు రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. గోదావరి, ఫలక్ నుమా, విశాఖ వందే భారత్, గరీబ్ రథ్ రైళ్లలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో రిజర్వేషన్ వస్తుందనే ఆశతో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో టికెట్ రిజర్వేషన్ కోసం వెళితే ఏ రైలుకైనా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులు ఉంటాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రైళ్లను రిగ్రెట్ అని కూడా వస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లకు 2 నెలల ముందే రిజర్వేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది కానీ అవి సరిపోవు. పండుగ రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లు నడపాలని, అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
Read also: Dunki Trailer: ఇది కంప్లీట్ గా డైరెక్టర్స్ సినిమా…
ఆ.. తేదీలకే డిమాండ్..
2024 జనవరి 14, 15 మరియు 16 తేదీల్లో సంక్రాంతి పండుగ దృష్ట్యా, జనవరి 11, 12 మరియు 13 తేదీల్లో నడిచే రైళ్లు ఇప్పటికే పూర్తిగా బుకింగ్ తో నిండిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లకు విశాఖ, గోదావరి, జన్మభూమి, ఫలక్ నుమా, వందే భారత్, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి, గరీబ్ రథ్, అలాగే చెన్నై, ముంబై, బెంగళూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లలో కనీస సౌకర్యాలు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
మరోవైపు కాజీపేట – వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైన్ పనుల కారణంగా కాజీపేట – విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ ఈ నెల 7తో సహా 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్ ప్రెస్ 10 నుంచి 18 వరకు ఈ నెల 6తో సహా. అలాగే ఆదిలాబాద్ – తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 5 నుంచి 19 వరకు రద్దు చేశారు. ఈ నెల 10 నుంచి 18 వరకు కాజీపేట – డోర్నకల్, డోర్నకల్ – విజయవాడ ప్యాసింజర్ పుష్ ఫుల్ రైళ్లు, కాజీపేట – తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను కూడా ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది. భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ 6 నుంచి 8వ తేదీ వరకు, 10 నుంచి 19వ తేదీ వరకు హసన్‌పర్తి రోడ్డు వరకు మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Gautam Adani Wealth: ఒక్కరోజులోనే 5.6 బిలియన్ డాలర్లు సంపాదించిన గౌతమ్ అదానీ
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!