Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
- ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ ఆదేశాలు
- బెయిల్ కోరిన డిఫెన్స్.. అభ్యంతరం తెలిపిన ప్రాసిక్యూషన్
- జూలై 15, 17 ఫిర్యాదులను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పీపీ
- చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Krishna Reddy : సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కోర్టులో ఉత్కంఠగా సాగిన వాదనలు
అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్, ప్రాసిక్యూషన్ (పీపీ) మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. డిఫెన్స్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 35(3) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని, తన క్లయింట్‌కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని తెలిపారు. సరైన ప్రాథమిక విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం చట్టప్రకారం చెల్లదని, తగిన ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
వరుస ఫిర్యాదులు.. తీర్పు రిజర్వ్ నుంచి రిమాండ్ వరకు
మరొకవైపు బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి జూలై 15న నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లోనూ, ఆ తర్వాత జూలై 17న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు అకాడమీ కూడా ఆగస్టు 5న హాజరుకావాలని ఉదయ్ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని వివరించింది. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మొదట తీర్పును రిజర్వ్‌లో ఉంచి, అనంతరం రిమాండ్ విధిస్తూ నిర్ణయం ప్రకటించింది.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!