Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
- వాట్సాప్ వేధింపులు, అసత్య ప్రచారాల ఆరోపణలు
- వ్యక్తిగత వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారన్న ఫిర్యాదు
- గదిలో బంధించి బెదిరించారని ఆరోపణ
- ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Krishna Reddy : నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన ఎఫ్ఐఆర్ (FIR) లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ (NTV) ఎక్స్‌క్లూసివ్‌గా సేకరించిన ఎఫ్ఐఆర్ కాపీలో ప్రధానాంశాలు ఇవే.
వాట్సాప్ వేధింపులు , ప్రచారం
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధించడమే కాకుండా, వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారుల వద్ద అసత్య ప్రచారాలు చేశాడు. అంతటితో ఆగకుండా, మరో ట్రైనీ అధికారితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవమానించాడు. బాధితురాలిని “Bitch”, “Shameless” వంటి అత్యంత అసభ్యకరమైన పదాలతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేసినట్లు సమాచారం.
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
వ్యక్తిగత వీడియోల చిత్రీకరణ.. భర్తకు పంపి బ్లాక్మెయిల్
బాధితురాలికి తెలియకుండానే ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసిన ఉదయ్, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి యత్నించాడని బాధితురాలు పేర్కొంది. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించి తీవ్ర మనోవేదన కలిగించాడు. అంతేకాకుండా ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తన గదికి తీసుకెళ్లి, పాస్వర్డ్ చెప్పాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. అదే సమయంలో ఆమెను అసభ్యకరంగా తాకుతూ, తీవ్రంగా వేధించినట్లు ఫిర్యాదులో నమోదైంది.
గదిలో బంధించి కత్తితో బెదిరింపులు
ఈ నెల 9వ తేదీ రాత్రి బాధితురాలిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి బంధించిన ఉదయ్ కృష్ణారెడ్డి, ఆమె జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. గది నుంచి బయటకు వెళ్లకుండా మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. ఆమెను అవమానించే ఉద్దేశంతో మూడు కండోమ్ ప్యాకెట్లను ఆమెపైకి విసిరాడు. అనంతరం ఈ నెల 10వ తేదీ ఉదయం కూడా ఆమెపై తీవ్రంగా శారీరక దాడికి పాల్పడ్డాడు. అకాడమీలో ఇతరుల సమక్షంలోనూ అసభ్యకరంగా మాట్లాడి ఆమె పరువుకు భంగం కలిగించాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!