Vikarabad Accident: వికారాబాద్ ఘటన.. మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Accident: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ స్పందించారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మృతుల కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కు సరైన రోడ్లు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి ఉండడంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇంచార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ పాల్గొన్నారు.
Read also: Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇవాళ ఉదయం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక, మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులు అంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులుగా పోలీసులు తెలిపారు. రోజూ కూలీ పనుల కోసం వికారాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kantara : ‘కాంతార’ చూసిన కేంద్రమంత్రి.. రిప్లై ఏమిచ్చారంటే..
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!