Tragedy Holi celebrations: హోలీ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. హోలీలో రంగువల్లులతో ఆహ్లాదకరంగా ఆడి స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి మరో స్నేహితుని రక్షించబోయి నీటిలో మునిగిపోయిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన దాదాపు పది మంది స్నేహితులు ఘనంగా హోలీ సంబరాలు సోమవారం జరుపుకున్నారు. అనంతరం ఇంద్రేశం గ్రామ శివారు సదర్ చెరువులో స్నానానికి వెళ్లారు. ఇందులో శివ అనే వ్యక్తి చెరువులో ఉన్న పుట్టె ఎక్కాడు ఆది గాలి వేగానికి ముందుకు వెళ్ళ సాగింది.
అయితే తనకు ఈత రాదని ఈ పుట్టే చెరువులోకి వెళ్ళిపోతుందని శివ స్నేహితులకు వినిపించేలా అరిచాడు. ఇది గమనించిన ఇంద్రేశం గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు బండి రాజేష్(28) ఈత సరిగ్గా రాకపోయినా ఆ పుట్టెను వెనక్కి తీసుకొద్దామని ముందుకెళ్ళి ఈతరాక మునిగిపోయాడు. అయితే స్నేహితులు పుట్టెను వెనక్కి తీసుకొచ్చి అందులో ఉన్న శివ అనే యువకుడిని కాపాడారు. ఈలోపుగా రాజేష్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు అయితే స్నేహితులు వెతికినా ఫలితం లేకుండా పోయిది.. రాజేష్ నీటిలో గల్లంతవ్వడంతో అతని బంధువులు గజ ఈతగాళ్ళ చేత చెరువులో వెతికిస్తున్నారు.
Read also: Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!
కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటి పల్లి వార్ధా నదిలో స్నానానికి వెళ్లి యువకులు గల్లంతైన ఘటన తీరని విషాదాన్ని నింపింది. హోలీ వేడుకలు జరుపుకున్న యువకులు ఆనందంలో స్నానం కోసం వార్ధా నదికి వెళ్లారు. అయితే వెళ్లిన యువకుల జాడ తెలియరాలేదు. ఒడ్డున వున్న మరికొంత మంది గుర్తించి అక్కడే వున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురు గల్లంతు అయినట్లు స్ధానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. నలుగురు గల్లంతు అయిన యువకులు సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. వీరు కౌటాల మండలం నదిమబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ నలుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: Murder Case: వేట కొడవళ్లతో సత్యసాయి జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..!
మరోవైపు సికింద్రాబాద్ లో హొలీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. హోలికి బంధువుల ఇంటికి వెళుతున్న భార్య భర్తలు రోడ్ ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీరని విషాదాన్ని నింపింది. సూచిత్ర నుంచి ముషీరాబాద్ వెళ్తుండగా ద్వి చక్ర వాహనంను లారీ ఢీ కొట్టింది. రోడ్ పై వైర్లు తెగి పడి ఉండడంతో పక్కకు వాహనం నిలిపివేసి వాహనదారులు వేచి ఉండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ రెండు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య భర్త లు ఆకాష్, నందిని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవన్ ను అదుపులో తీసుకున్నారు.
Read also: Delhi: ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బండ్లగుడా శాంతినీకేతన్ ప్రైవేట్ స్కూల్ లో 8 వతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే ముగ్గురిలో ఒకరైన నరేష్ కుమార్(12) ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిన్నటి నుండి నరేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేడు నరేష్ మృత దేహం ఆచూకీ లభించడంతో పడవల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Read also: Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు
నారాయణపేటలో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్‌పేట వీధిలోని మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ట్యాంక్ సిమెంట్ ముక్కలు వారిపై పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత(12) అనే చిన్నారి మృతి చెందింది. ప్రణీత చేయి విరగడంతో హరిప్రియ కాలు విరిగింది. ఇంతలో ప్రమాదానికి కారణమైన ట్యాంకును స్థానికులు పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్