ఈనెల 8నుంచి స్వతంత్ర భారత వత్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నేడు ఎల్బీ స్టేడియంలో 30వేల మంది సమక్షంలో అట్టహాసంగా జరిగే ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. పలువురు సమరయోధులకు సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్లు, ఎంపిపి లు, జెడ్పిటీసీ లు ప్రజాప్రతినిధులకు ఆహ్వానించారు. ఈ వేడుకలలో పాల్గొననున్న జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తెలంగాణా సమరయోధుల వారసులను. అంతర్జాతీయ పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకి సన్మానం చేయనున్నారు.
మూడు గంటలపాటు ముగింపు ఉత్సవాలు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన వుంటుంది. వార్సీ బ్రదర్స్ చే ఖవ్వాలి, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. లేజర్ షో తో పాటు భారీ ఎత్తున బాణసంచా ప్రదర్శన, దాదాపు 30 వేలమంది ఈ ముగింపు ఉత్సవాలలో పాల్గొనే ఏర్పాట్లు
ఇక ఇందులో భాగంగా.. ఎల్బీస్టేడియాలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో..నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధాంచారు. ఇవాళ సోమవారం మధ్నాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీస్టేడియం వైపు వెళ్లే రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈనేపథ్యంలో.. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు:
చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతించనున్నారు. ఇక గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. కాగా..రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు. దీంతో.. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు. నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారిమళ్లించి హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు. కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్, ఇడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు. బషీర్‌బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు. హిమాయత్‌నగర్ వై-జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై-జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.
Jr Ntr Meets Amit Shah At Novatel: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ కీలక భేటీ