Traffic Restrictions: అలర్ట్… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
- హైదరాబాద్ వాహనదారులకు కీలక గమనిక
- రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
- ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు
- పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు బంద్
- రేపు ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు
- ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Restrictions: హైదరాబాద్ వాహనదారులకు కీలక గమనిక… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామన్నారు. సోమవారం బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తామని పోలీసులు వివరించారు. పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్.. వివరాలు ఇవే..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
రేపు ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను దారి మళ్లిస్తామని పేర్కొన్నారు. పురానాపూల్, కమాటిపురా మరియు కిషన్‌బాగ్ వైపు నుండి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుండి 11:30 వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రార్థనలకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్క్, మసీదు అల్హా హో అక్బర్ ముందు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సోమవారం (జూన్ 17) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వారు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న మీరాలం ఈద్ సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇంకా, ఈ ప్రార్థనలకు 30,000 మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Drinking Beer: బీర్లు తాగాడు.. లక్షాధికారి అయ్యాడు.. అదెలా?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!