Traffic Restrictions in Cyberabad: రేపు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 25 వ తేదీన గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ జరగనున్న నేపథ్యంలో.. సైబరాబాద్‌లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే.. ఈ సైక్లింగ్ మారధాన్ లో సుమారు వెయ్యిమంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశం ఉందదని, సైక్లింగ్ సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు.
Read also: Flight on Road: గాల్లో విమానం రోడ్డుమీదకు.. ఏంటా కథ?
ఈనేపథ్యంలో.. ఐటీసీ కోహినూర్, ఐకియా, రోటరీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్, గచ్చిబౌలి రడ్డు నెంబర్ 45, దుర్గం చెరువు, జూబ్లిహిల్స్ ఇనార్బిట్‌మాల్, సీవోడీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో సైక్లింగ్ మారథాన్ జరుగుతుందని తెలిపారు. కావున ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు, నిర్వహాకులు పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటల తరువాత ట్రాఫిక్ యధావిధిగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ప్రతి ఏడాది గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ సంస్థ సైక్లింగ్ మారథాన్ ను కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఏడాదికి ఈ పోటీలో పాల్గొనే సైక్లిస్టుల సంఖ్య పెరుగుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Hyderabad Central University: విద్యార్థుల ఆందోళన.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ధర్నా