Hyderabad: పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు.. పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మొహర్రం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోగా, వాహనదారులను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలపై హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఊరేగింపు సందర్భంగా బీబీ కా అలవా డబీర్‌పురా నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్, గుల్జార్ హౌస్, బీబీ కా అలవా రోడ్, షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, సూరజ్ టాకీస్, సర్దార్ మహల్, పంజేషా, మండి మీర్ ఆలం, పురానీ హవేలీ, దారుల్షిఫా, ఎతేబాజ్ చౌక్, అలీజా కోట్ల, మెస్కో, ఇమ్లిబాన్, చాదర్‌ఘాట్ మార్గాలను మళ్లిస్తారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Read also: Tomato: Paytm, ONDC ద్వారా టమాటాలు ఉచిత డెలివరీ.. కండీషన్స్ అప్లై..!
Also Read
ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని, రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. కానీ హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం మొహర్రం ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అషుర్ఖానా బీబీ-కా-అలావా వద్ద ప్రారంభమై చాదర్‌ఘాట్‌లోని మస్జిద్-ఎ-ఇలాహి వద్ద ముగుస్తుంది. దాదాపు 11 కిలోమీటర్ల మేర జరిగే ఈ ఊరేగింపులో ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొంటారు. ఈసారి కూడా లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. శోభాయాత్ర కోసం రిహాల్సర్స్ ఇప్పటికే తీసుకున్నారు. ఊరేగింపు సందర్భంగా శనివారం సామాన్య ప్రజల కోసం చార్మినార్ సందర్శనలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ పోలీసులు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Jailer: ‘సూపర్ స్టార్’ తుఫాన్ కి సిద్ధమైన చెన్నై…
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!