Congress Janajatara: తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిబంధనలు పాటించాలన్నారు. ఖమ్మం, నల్గొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు లేదా పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ లేదా సర్వీస్ రోడ్డు నుంచి బెంగళూరు టోల్‌కు వెళ్లే వాహనదారులు రావిర్యాల టోల్ వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌కు చేరుకోవాలి.
Read also: Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
మాల్, ఇబ్రహీపట్నం, నాగార్జున సాగర్ హైవే, మహబూబ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్ బెంగళూరు టోల్ నుంచి రావిర్యాల టోల్ నుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. బెంగుళూరు జాతీయ రహదారి 44 నుండి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణ భారతి ట్రస్ట్, పెద్ద గోల్కొండ సర్వీస్ రోడ్ నుండి ఓల్డ్ PM మీటింగ్ ప్లేస్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించాలి. జహీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పటాన్‌చెరు నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద దిగి ఓల్డ్ పీఎం సమావేశ స్థలంలో పార్కింగ్ చేయాలి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ మీదుగా రావిర్యాల వద్ద దిగి ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేసిన పార్కింగ్ వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు.
Read also: Komaram Bheem: సరిహద్దు దాటిన ఏనుగు.. 53 గంటల పాటు తెలంగాణలో సంచారం
సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు సమీర్‌పేట మీదుగా రావిర్యాలకు చేరుకుని ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌కు చేరుకోవాలి. శ్రీశైలం వైపు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమ మలుపు తిరిగి ఆగాఖాన్ అకాడమీ, విజయదెయిరి, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్ల జంక్షన్, తిమ్మాపూర్, రాచులూరు గేటు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలం రోడ్డు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగి మన్సానపల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్ చేరుకోవాలి. సమావేశం నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను దిగేందుకు అనుమతి లేదన్నారు. పెద్ద అంబర్‌పేట నుంచి పెద్దగోల్కొండ రహదారిపై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ వాహనాలను అనుమతించరని సచించారు.
Weight Loss : త్వరగా బరువు తగ్గాలంటే వీటిని రోజూ తినాల్సిందే..