హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నగరంలో ఒకే సమయంలో రెండు అతి పెద్ద ర్యాలీలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇది కూడా చదవండి: UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?
ఇటీవలే టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుంది. గురువారమే క్రికెటర్లు భారత్‌కు చేరుకున్నారు. టీమిండియాకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ఇక ప్రపంచ కప్ సాధించడంలో భాగమైన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి నగరంలోకి భారీ ర్యాలీ నిర్వహించేందుకు క్రికెట్ అభిమానులు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Home Remedies: స్ట్రెచ్ మార్క్స్ను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
మరోవైపు ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇలా రెండు ర్యాలీలు కూడా ఒకే సమయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?
చంద్రబాబు బేగంపేట విమానాశ్రాయం నుంచి జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి.. అక్కడ నుంచి నివాసానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇక సిరాజ్ ర్యాలీ కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సాయంత్రం 6గంటలకు మొదలవుతుంది. రెండు ర్యాలీలు నగరంలోనే జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాహనదారులకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Nandikotkur: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల బైబై..