హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నగరంలో ఒకే సమయంలో రెండు అతి పెద్ద ర్యాలీలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Sankranti 2023: హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారింది. సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకోవడానికి సొంత గ్రామాలకు లక్షలాది మంది తరలివెళ్లడంతో… జనారణ్యం బోసిపోయింది. ప్రజలు నగరాల నుంచి పల్లె బాట పట్టడంతో… ఆయా హైవేల్లోని టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. సొంత వాహనాల్లో సొంతూర్లకు వెళ్తుండటంతో…. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ జాతీయ రహదారిలో పతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలు…
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్‌డీపీ కింద…