Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?
- ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను భారత్ లో విడుదల చేసిన బజాజ్
- దీని ప్రారంభ ధర రూ. 95 000 (ఎక్స్-షోరూమ్)
- డిస్క్ ఎల్ఈడీ (LED).. డ్రమ్ ఎల్ఈడీ(LED).. ఫ్రీడమ్ డ్రమ్ అనే మూడు వేరియంట్లు
- ఫీచర్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. డిస్క్ ఎల్ఈడీ (LED), డ్రమ్ ఎల్ఈడీ(LED), ఫ్రీడమ్ డ్రమ్ అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ దీనిని పరిచయం చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000, డ్రమ్ ఎల్ఈడీ ధర రూ.1,05,000 మరియు డిస్క్ ఎల్ఈడీ ధర రూ.1,10,000గా నిర్ణయించింది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉన్నాయి. 125 సీసీ ఇంజిన్ కలిగిన ఫ్రీడమ్ 125లో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. రెండూ కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. సీఎన్‌జీ, పెట్రోల్ ట్యాంక్‌ను సీటు కింద అమర్చారు. ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్ అయ్యిందని కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సీఎన్‌జీ లీక్ కాకుండా భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని, కేవలం ఐదేళ్లలోనే రూ.75వేల వరకు దీంతో ఆదా చేసుకోవచ్చని బజాజ్ ఆటో పేర్కొంది.
READ MORE: Home Remedies: స్ట్రెచ్ మార్క్స్ను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ఫ్రీడమ్ 125 CNG బైక్‌లో.. ఎల్ఈడీ (LED) హెడ్‌లైట్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అనేక రకాల క్రాష్ టెస్ట్‌ల ద్వారా ధృవీకరించబడిన బైక్‌కు కంపెనీ అద్భుత డిజైన్‌ను అందించింది. ఈ బైక్‌లో 2 కిలోల సిఎన్‌జి ట్యాంక్ మరియు 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చారు. ఫ్రీడమ్ 125లో 2 లీటర్ CNG ట్యాంక్.. 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. బైక్‌లో ఇంధనాన్ని ఎంచుకోవడానికి హ్యాండిల్‌పై స్విచ్ కూడా అందించబడింది. ఈ బైక్ 330 కిలోమీటర్ల ఫుల్ ట్యాంక్ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. కంపెనీ త్వరలో బైక్ డెలివరీని ప్రారంభించవచ్చు.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!