Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Traffic Curbs For Sadar Utsav Mela In Hyderabad Today

నేడు హైదరాబాద్‌లో ‘సదర్‌’.. ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్తే అంతే..!

Published Date :November 6, 2021 , 9:17 am
By Sudhakar Ravula
నేడు హైదరాబాద్‌లో ‘సదర్‌’.. ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్తే అంతే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్‌ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్‌లు, గ్రామాలకు కూడా విస్తరించింది.. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు యాదవ సోదరులు.. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్‌ ఘనంగా జరగగా.. రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, కాచిగూడ, ఈస్ట్‌ మారెడ్‌పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు.. నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో కూడా సదర్‌ ఉత్సవాలు జరగనున్నాయి.. ఇక, నారాయణగూడ వైఎంసీఏ కూడలి సదర్‌ ఉత్సవానికి ముస్తాబైంది.. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలతో పాటు.. ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

సదరు ఉత్సవాల నేపథ్యంలో నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.. కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేసి కాచిగూడ టూరిస్ట్‌ హోటల్‌ వైపు మళ్లిస్తారు. ఇక, విఠల్‌వాడి చౌరస్తా (రాంకోఠి నుంచి) నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రాంకోఠి కూడలి వైపు మళ్లింపు.. రాజ్‌మోహల్లా నుంచి వచ్చే వాహనాలు సాబూ షాప్‌ పాయింట్‌ నుంచి రాంకోఠి చౌరస్తా మీదుగా మళ్లింపు.. నారాయణగూడ రెడ్డి మహిళా కాలేజ్‌ నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పుర వైపు మళ్లింపు. బర్కత్‌పుర పాత పోస్టాఫీసు కూడలి నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను అనుమతి లేదు.. క్రౌన్‌ కెఫే లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తారు.. పాత ఎక్సైజ్‌ ఆఫీసు లేన్‌ నుంచి వైఎంసీఏ వైపు వాహనాలు విఠల్‌వాడి వైపు మళ్లింపు.. బర్కత్‌పుర చమన్‌ నుంచి వైఎంసీఏ వైపు రాకపోకలు బంద్‌ చేసిన అధికారులు.. బర్కత్‌పుర చౌరస్తా వైపు లేదా టూరిస్ట్‌ హోటల్‌ వైపు మళ్లిస్తారు.. బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ నుంచి రెడ్డి మహిళా కళాశాల వైపు వాహనాలు నారాయణగూడ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ఇక, సదర్‌ ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇద్దరు ఏసీపీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్సైలు, 200 మందికిపైగా కానిస్టేబుళ్లతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక, సదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యాదవులు సిద్ధం అయ్యారు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నలను తీసుకొచ్చి సిద్ధం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Narayanaguda
  • Sadar Utsav
  • Sadar Utsav Mela
  • telangana

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions