Panthangi Toll Plaza: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH 65 సంక్రాంతి పండుగ కారణంగా రద్దీగా మారింది. నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు ఇళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంబించింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలో ట్రాఫిక్‌ను నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం GMMAR 30 మంది అదనపు సిబ్బందిని నియమించింది. టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ జామ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read also: Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!
ఏదైనా ప్రమాదం జరిగితే రవాణాకు ఇబ్బంది కలగకుండా ప్రతి 20 కి.మీకి ఒక క్రేన్, ప్రతి 30 కి.మీకి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే 100 లేదా వాట్సాప్ నంబర్ 8712662111లో సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాహనదారులు ఏమైనా ఇబ్బందులుంటే 1033 నంబర్‌కు సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోడిపందాలు నిర్వహిస్తారు. ఈ కోడిపందాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మూడు రోజుల పాటు జరిగే పండుగను పురస్కరించుకుని ప్రజలు స్వగ్రామాలకు రావడంతో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి 11 రోజులే.. ప్రధాని ప్రత్యేక పూజలు..!