బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మారిపోయింది.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని వదిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడన్న ఆయన.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ, ఆయన తూటా కాంగ్రెస్ వైపు పేల్చుతున్నారని విమర్శించారు..
Read Also: వంగవీటి రంగా పేరు పెట్టకపోతే ఉద్యమమే..!
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
ఇక, కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు… ఇది దురదృష్టకరం అన్నారు జగ్గారెడ్డి.. తెలంగాణలో బీజేపీ నుండి ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ఉన్నారు.. మీరందరూ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఏమి చేసినట్టు..? అని ప్రశ్నించిన ఆయన.. బండి సంజయ్ మా ప్రభుత్వం అదీ, ఇదీ అని నరుకుతుంటరు.. కదా? తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో నీ నర్కుడు ఏమైంది? అని మండిపడ్డారు.. నీకు ఎప్పుడూ రాజకీయాలు కావాలి తప్పా ప్రజల సంక్షేమం అక్కర్లేదు అని ఎద్దువా చేశారు.. మరోవైపు.. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు.. కేసీఆర్ ఆలోచించి మాట్లాడారా, ఆలోచన లేకుండా మాట్లాడారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది అంబేద్కర్ రాసిన జ్యాంగం వల్లనే కదా..? అని గుర్తుచేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో ఏ ఫ్రంట్ కూడా అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!