Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చాలు, దర్శకనిర్మాతలు సాధారణంగా రివ్యూయర్స్ పై మండిపడటం, పబ్లిక్ టాక్‌ను తప్పుపట్టడం చేస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్. రివ్యూవర్లను బ్లేమ్ చేయకుండా, వారి మాటలని పట్టుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రైటర్ కమ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ నిన్న సక్సెస్ మీట్లో బయటపెట్టిన ఒక షాకింగ్ నిజం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రీమియర్ షోల తర్వాత రివ్యూయర్స్ , ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, కొన్ని చోట్ల ఆడియెన్స్ హాల్ నుంచి వాకౌట్ చేయడం వంటి పరిణామాలను ఆ టీమ్ సీరియస్‌గా తీసుకుంది. ఇగోకు పోకుండా, ప్రేక్షకుల అభిప్రాయమే శిరోధార్యమని భావించారు.
ఆ తర్వాతే అసలైన మేజిక్ జరిగింది. రాత్రికి రాత్రే సెకండాఫ్ మొత్తాన్ని రీవర్క్ చేసి, ఎడిటింగ్ మార్పులతో కూడిన అప్డేటెడ్ వర్షన్‌ను శుక్రవారం మ్యాట్నీ షోలకల్లా థియేటర్లకు పంపించారు మేకర్స్. సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ డేరింగ్ స్టెప్ అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. మొదట్లో వచ్చిన మిక్సడ్ రివ్యూలు కాస్తా, బ్లాక్‌బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్‌గా మారాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. విమర్శలను తప్పుపట్టకుండా, ప్రేక్షకులు చెప్పింది వింటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఏది ఏమైనా.. రివ్యూవర్లు, ఆడియెన్స్ మాట విని, కరెక్ట్ టైమ్‌లో స్పందిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సక్సెస్ నిరూపిస్తోంది!
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?