Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tpcc Revanth Reddy Letter To Cm Kcr Once Again

CM KCR : మరోసారి కేసీఆర్‌ కి టీపీసీసీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ..

Published Date :June 22, 2022 , 12:27 pm
By Gogikar Sai Krishna
CM KCR : మరోసారి కేసీఆర్‌ కి టీపీసీసీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలని, తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో, ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల మీ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుందని ఆయన మండిపడ్డారు. విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పులు… అది చాలదన్నట్టు ఇటీవల ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపారని ఆయన విమర్శించారు. ఒకవైపు అప్పుల ద్వారా, మరోవైపు భూముల అమ్మకం ద్వారా, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్ ఛార్జీల పెంపు ద్వారా, భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా, బస్ ఛార్జీల పెంపు ద్వారా, అడ్డు అదుపులేని మద్యం అమ్మకాల ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి, ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో, ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే చెబుతారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిహారాలు పంచి వస్తారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా పత్రికల్లో మీరేదో మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటారు. మీ పుత్రరత్నం విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.

మరోవైపు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా… శాంతిభద్రతల పరిరక్షణలో నిద్రాహారాలు మాని పని చేసే హోం గార్డులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వరు. మీ వింధులకు, విలాసాలకు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే మీరు…నెల జీతం వస్తే కాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచన చేశారా? సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని అనుకుంటున్నారు? కట్టు బానిసల కంటే ఘోరమైన స్థితిలో పని చేసే హోంగార్డుల విషయంలో మీకు కనీస కనికరం లేదా? జూన్ నెల కూడా ముగుస్తు్న్నా… ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వని మీ నిర్వాకాన్ని ఏమని ప్రశ్నించాలి? అదే సమయంలో మెడల్ స్కూళ్లలో టీచింగ్ – నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి.

వారు కూడా మే నెల జీతాల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ వర్గాలన్ని పేద, మధ్య తరగతికి చెందిన వారే. నెల జీతమే వారికి ఆధారం. అట్లాంటి వారి జీతాలు, జీవాతాలతో చెలగాటం ఆడుతారా? వారికి నెల జీతం ఇవ్వలేని దుస్థితి మీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? తొలకరి మొదలై… వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేయలేదు. ఈ సారి రైతుబంధు ఉంటుందా… ఉంటే ఎప్పుడిస్తారు… అసలు ఇస్తారా లేదా అని పేద రైతులు ఎదురు చూస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్… వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు. కనీసం ఆర్థిక మంత్రైనా పరిస్థితిని సమీక్షించి, సరిదిద్దుతాడేమో అనుకుంటే ఆయన మీ రాజకీయ ప్రేలాపనలకు కోరస్ పాడే పనిలో బిజీగా ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది.

రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలుస్తోంది. మీ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాళీ తీసిందన్న విషయం అర్థమవుతోంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారన్న విషయం తెలుస్తూనే ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి. మీ విలాసాలు, జల్సాలు, రాజకీయ విన్యాసాలు ఆపి చిరు ఉద్యోగులైన హోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుంది అని రేవంత్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • cm kcr
  • LATEST TELUGU NEWS
  • TPCC Revanth Reddy

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions