Revanth Reddy: హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? అంటూ ప్రశ్నించారు. పౌర సమాజం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచన చెయ్యాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
అయితే.. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో యువకులు హల్చల్ చేశారు. గంజాయి సేవించి మత్తులో పోలీసు వాహనం పై ఎక్కి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేయడమే కాకుండా..
పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు పోలీసులు. అయితే .. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్ అనే యవకుడిని అసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే…
ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది.
ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి. pic.twitter.com/jIHrYnBtZi— Revanth Reddy (@revanth_anumula) June 14, 2022
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!