ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు.…
హాలండ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హాలండ్ హేగ్‌లోని తన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన భారతీయుడు ఊపిరాడక మృతి చెందాడు. ఆసిఫ్‌నగర్ నివాసి అబ్దుల్ హదీ సెలవు కోసం భారతదేశానికి వచ్చి 2021 మార్చిలో తిరిగి హాలండ్ వెళ్ళాడు. హాలండ్ లోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉంటున్న అబ్దుల్ హదీ భవనంలో అగ్నిప్రమాదం…