Revanth Reddy: చరిత్రలో బీజేపీ లేదు.. అమిత్ షా సభకు జనం లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో బీజేపీ లేదు కాబట్టే అమిత్ షా సభకు జనం లేరని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళ్ళు మొక్కి ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యం అవ్వండి అని ప్రజల్ని అడుగుతామన్నారు. మునుగోడు ఎన్నికల ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ కి చెక్ పెట్టాలని పిలుపు నిచ్చారు. సెప్టెంబర్ 17 గొప్ప స్వాతంత్ర్య దినోత్సవం అని అన్నారు. చరిత్ర లేని వాళ్ళు… యుగ పురుషులు లేని వాళ్ళు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ దొంగతనం చేస్తుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నీ నిషేధించారని, చరిత్ర నూ..నాయకులను బీజేపీ దొంగ తనం చేస్తుందని మండిపడ్డారు. అమిత్ షా సభకు 1500 మంది కూడా లేదని ఎద్దేవ చేశారు. ఎందుకంటే.. ఈ చరిత్ర లో బీజేపీ లేరు కాబట్టి జనం కూడా లేదని అన్నారు.
గుజరాత్ లో ఉన్న రాజు.. హైదరాబాద్ నిజాం రాజు..జమ్ము రాజు అంతా ఒకరే అని రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వచ్చిన ఏడాది కి ఈ మూడు ప్రాంతాలకు స్వాతంత్య్రం వచ్చిందని రేవంత్ తెలిపారు. గుజరాత్ లో జునే ఘాడ్ లో ఎందుకు వజ్రోత్సవాలు చేయరు అని ప్రశ్నించారు. తెలంగాణ కి వచ్చి హడాహుడి ఎందుకు చేస్తుంది? అని రేవంత్ ప్రశ్నించారు. గుజరాత్ లో రాజు నుండి జునే ఘడ్ కి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. అక్కడి నుండి వచ్చిన అమిత్ షా ఎందుకు వేడుకలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అక్కడ 75 యేండ్ల వజ్రోస్త వాలు చేయదు ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ లో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా?. అక్కడ ఎందుకు వేడుకలు చేయరన్నారు రేవంత్ రెడ్డి. ముందు జునేఘద్ లో ఉత్సవాలు చేయండి? అని సలహా ఇచ్చారు.
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
గుజరాత్ మంత్రులు హైదరాబాద్ పై కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ కల్లోలాలు పెట్టీ.. ఇక్కడి పెట్టుబడి దారులను గుజరాత్ తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు రేవంత్. అసలు అసద్ ఎవరు? తెలంగాణకు అసద్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆయన్ని భూతంగా పెట్టీ తెలంగాణను అక్రమించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. భాగస్వామ్యం లేని పాత్ర పోషిస్తా అంటే జనం ఊరుకోరన్నారు. లగడ పాటి వచ్చి తెలంగాణ ఉద్యమం నేనే చేసిన అంటే ఎలాగా ఉంటుందో.. అమిత్ షా సెప్టెంబర్ 17 పేరుతో సభ పెడితే కూడా అలాగే ఉంటుందని వ్యంగాస్త్రం వేసారు రేవంత్ రెడ్డి. అందుకే అమిత్ షా సభకు జనం రాలేదన్నారు. చరిత్ర వక్రీకరిస్తాం అంటే ప్రజలు హర్షించరని రేవంత్ పేర్కొన్నారు. 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్‌ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు. అక్టోబర్ 2 నుండి పాదాభి వందనం.. మునుగోడు లో ఉన్న అందరినీ కలుస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.
BIG Breaking: మూడు రాజధానులపై సుప్రీంకి ఏపీ సర్కార్.. అది సాధ్యం కాదు..!
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్‌ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..