డీసీసీలకు కొత్త పీసీసీ చీఫ్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరిగిన పెట్రోల్ ధరలు, నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారిగా సమావేశమైన పీసీసీ కమిటీ.. ఈ నెల 12, 16 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై 48 గంటల పాటు దీక్ష చేయాలని తీర్మానించింది. ఇకపై ప్రతి వారం పీసీసీ కమిటీ సమావేశం కానుంది. ఇక హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకి అప్పగించారు. వచ్చే వారంలో పార్టీ నాయకులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించే ఆలోచనలో ఉంది పార్టీ.
పెరిగిన పెట్రో ధరలపై ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సైకిల్, ఎడ్ల బండ్ల ర్యాలీలు చేయాలని తీర్మానించిన పార్టీ.. అటు రాష్ట్రంలోని కోవిడ్ మరణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయయాలని భావిస్తోంది. డీసీసీలతో జరిగిన సమావేశంలో నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. తనకు భేషజాలు లేవని.. అందరితో కలిసి పని చేస్తానని మాటిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. నిన్ననే పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేపనిలో మునిగిపోయారు.
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- Tags
- DCC
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!