రాజకీయ ఎంట్రీకి కారణాలు ఇవే.. పాడ్‌కాస్ట్‌లో జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన రాజకీయ ఎంట్రీకి ఎక్కడ బీజం పడిందో చెప్పారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. పాఠశాల నాటి పరిస్థితులు, రాజకీయంపై ఆసక్తి పెరగడానికి గల కారణాలు వివరించారు. తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని.. అక్కడి నుంచే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లమని తెలిపారు. “చిన్నతనంలో ఉన్నప్పుడే రాజకీయాలను అనుసరిస్తూ ఉండేవాళ్లం. మేము చదివిన పాఠశాల(గవర్నమెంట్) సమాజాన్ని మాకు పరిచయం చేసింది. మేము చిన్న కాలనీలో ఉండేవాళ్లం. పక్కన వాళ్లు, పేరెంట్స్ మాటలు వినేవాళ్లం. ఇప్పుడంటే చదువు తప్ప వేరే ధ్యాస లేదు. అప్పుడు అలా కాదు.. చదువుతో పాటు అన్ని విషయాలను మనకు పరిచయం చేసేవాళ్లు. అప్పట్లో ఉన్న టీచర్లు సైతం వీళ్లు రేపటి దేశ పౌరులుగా తయారవ్వాలన్న భావనతో అనేక విషయాలు పరిచయం చేసేవాళ్లు. తరగతి గదిలో కూడా చిన్న స్థాయిలో ఎన్నికలు కండక్ట్ చేసే వాళ్లు. అప్పటి నుంచే పాలిటిక్స్, పొలిటికల్స్ స్పీచ్‌లు, ఎన్నికలు గమనిస్తూ ఉండేవాళ్లము. ముఖ్యంగా హిందీ నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉండేది. అటల్ బిహారీ వాజ్‌పేయి స్పీచ్‌లు వినేవాళ్లం. ఆయన మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. టీవీలు కూడా లేవు. రేడియోల ద్వారా వినేవాళ్లం. 1977లో ఇందిరా గాంధీ మా ఊరు శ్రీ శైలానికి వచ్చారు. అప్పుడు వర్షం పడుతుంది. క్రౌడ్ చాలా తక్కు మంది వచ్చారు. ఆమె స్పీచ్ విందామని మేము కూడా అక్కడికి వెళ్లాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చాలా ముఖ్యమని భావనలు చిన్నతనంలోనే ఉన్నాయి. కాబట్టి స్కూల్స్, కాలేజీల్లో లీడర్ షిప్ అనేది అప్పటి నుంచే అలవాటు అయిపోయింది. ఈ విధంగా ఆ పొలిటికల్ టచ్ అందరికీ ఉండాలని నా అభిప్రాయం. ఇది ఒక బాధ్యత. సర్వీస్‌లోకి వచ్చిన తరువాత కూడా ప్రజలతో మమేకం అయ్యేవాడిని. మహారాష్ట్ర కూడా అటువంటి వాతావరణం ఉన్న రాష్ట్రం కాబట్టి కలిసొచ్చింది. అక్కడ చైతన్యవంతమైన ప్రజలు ఉండేవాళ్లు. పోలీసింగ్ చూస్తూనే ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలను తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని.” అని వెల్లడించారు. ఇలా రాజకీయంపై ఆసక్తి పెరిగిందని వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు రఘునందన్ రావు సవాల్
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. “నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీలకు ఏం చేసిందో నేను చెబుతా. మరి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్, విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా?” అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను గణాంకాలతో చర్చకు వస్తానని, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తానని స్పష్టం చేశారు.
భార్య కోరికలు తీర్చేందుకు దొంగగా మారిన భర్త..
ప్రస్తుతం కాలంలో పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడుతున్నారు. పెళ్లి చేసుకుంటే, భార్య లవర్ చేతిలో హత్యకు గురవుతామో అనే భయం కూడా కొందర్ని వెంటాడుతోంది. మరికొందరు మాత్రం, చాలీచాలని జీతంతో పెళ్లి చేసుకోవడం అవసరమా..? అని భావిస్తున్నారు. భార్యలు, అత్తమామల ఖరీదైన కోరికలు తీర్చడానికి జంకుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా భార్య లగ్జరీ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి పూర్తి స్థాయిలో దొంగగా మారాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. తన భార్య ఖరీదైన కోరికలు తీర్చలేక, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ) చదివిని ఓ వ్యక్తి, పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఉద్యోగం మానేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తరుణ్ పరీక్ అనే వ్యక్తిని వివాహం జరిగిన నెల రోజులకే పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య డిమాండ్లను తీర్చడానికి నేర మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ప్రకంపనలు.. వెలుగులోకి సంచలన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై సంచలనం రేగుతోంది. ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం, ఆసుపత్రి నిర్వాకం వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానం డీఎన్‌ఏ పరీక్షలతో నిజమైంది. ఇది పెద్ద ఎత్తున అక్రమాలకు, అనైతిక పద్ధతులకు అద్దం పడుతోంది.
టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన దంపతులకు మగబిడ్డ పుట్టాడు. అయితే, బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితమే బాబుకు క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కు గురయ్యారు. దీంతో మరో డాక్టర్‌ను సంప్రదించి డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డ డీఎన్‌ఏ తమ వీర్యకణాలతో సరిపోలడం లేదని, మరొకరి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆగ్రహించిన దంపతులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు.
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 కార్లను ఢీకొట్టిన ట్రక్కు..
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్‌లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ, “కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా?” అని ప్రశ్నించారు. అలాగే, “నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం నీకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సంస్కారం అడ్డువస్తోంది” అని సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఆసియా కప్ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఆసియా కప్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్ షెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఎఇలో జరుగనుంది. భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్‌లో జరుగనుంది. ఇది ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ కప్‌ను భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 4 జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ Aలో భారతదేశం, పాకిస్తాన్, UAE, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య జరుగనుంది. భారత్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న UAE తో జరుగుతుంది. రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరుగుతుంది. మూడవ మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్ తో జరుగుతుంది.
వలసలను ఆపకుంటే యూరప్ నాశనం..ట్రంప్ బిగ్ వార్నింగ్..
యూరప్ దేశాల్లోకి ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వలసలు యూరప్‌ని చంపేస్తున్నాయి’’ అంటూ శనివారం ఆయన వ్యాఖ్యానించారు. వలసల్ని నిరోధించడానికి కలిసి రావాలని అన్నారు. స్కాట్లాండ్‌లో పర్యటనలో ఉన్న ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా యూరోపియన్ దేశాలు ‘‘భయంకరమైన దండయాత్ర’’లను ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు. వలసల విషయంలో కలిసి పనిచేయడం మంచిదని, లేకుంటే మీకు ఇకపై యూరప్ ఉండదని యూరోపియన్ దేశాలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నాయకులు వీటిని అడ్డుకోవడం లేదని, వారి పేర్లు చెప్పగలను అని, ఈ వలసలు యూరప్‌ని చంపుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ట్రంప్ తండ్రి ఫ్రెడ్, తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ యూరప్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
నెమ్మదిగా థియేటర్లు పెరుగుతున్నాయ్!
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. నిజానికి ఈ సినిమాని హోంబాలే ఫిల్మ్ సంస్థ ప్రజెంట్ చేసింది. క్లీమ్ స్టూడియోస్ అనే సంస్థ ఈ యానిమేటెడ్ సినిమాని హోంబాలే దగ్గరికి తీసుకొచ్చి సపోర్ట్ చేయమని అడగడంతో హోంబాలే ముందుకు వచ్చింది. అయితే హోంబాలే తీసుకున్న నిర్ణయం నోటికి నూరు పాళ్ళు సరైనదే అని నిన్న సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ అలా ఉంది. ముఖ్యంగా వరాహ అవతారం ఎపిసోడ్‌తో పాటు సినిమా చివరి అరగంట ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చేయడంలో సక్సెస్ అయింది. యానిమేటెడ్ కంటెంట్‌లా కాకుండా ఇదేదో స్ట్రైట్ కమర్షియల్ సినిమా అనేలా థియేటర్లలో ఈలలు వేస్తూ అరుస్తూ గోల చేస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించిన నేపథ్యంలో ఈ సినిమాకి భారీగా థియేటర్లు దక్కలేదు. కానీ హరిహర వీరమల్లు టాక్ కాస్త నెగటివ్‌గా రావడంతో ఆ సినిమాకి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి థియేటర్లు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా సంస్థ ఈ సినిమాకి థియేటర్లు పెంచే విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అశోక్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది.
