యూరియా సరఫరాపై తుమ్మల ఓపెన్ లెటర్.. కేంద్రం వైఫల్యంతో రైతులు ఇబ్బందులు
తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హామీ ఇచ్చారు. లేఖలో ప్రభుత్వం ఇప్పటి వరకు పాత నిల్వలతో కలిపి 7.32 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) యూరియాను రైతులకు పంపిణీ చేసినట్టు వివరించారు.
“No Ram, No Ramayana”అని సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బండి సంజయ్ మాట్లాడుతూ – “రామ సేతు కేసులో ‘No Ram, No Ramayana’ అని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెస్‌నే. దశాబ్దాల పాటు రామ మందిర తలుపులు మూసి వేసింది కూడా కాంగ్రెస్‌నే. రాహుల్ గాంధీ ఒకప్పుడు ‘రామ్ మందిర ఉద్యమం ఓడిపోయింది’ అని వ్యాఖ్యానించలేదా? హిందువులను ‘హింసాత్మకులు’ అని అన్నది కాంగ్రెస్‌నే. రామ్ మందిర ప్రాణ ప్రతిష్ఠకి కూడా హాజరుకావడానికి నిరాకరించింది అదే పార్టీ” అని ఆరోపించారు.
సిట్ చార్జి షీట్ పై కోర్టు అభ్యంతరాలు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో దాఖలైన సిట్ చార్జ్‌షీట్‌పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం సుమారు 20కి పైగా అభ్యంతరాలు నమోదు చేసింది. న్యాయస్థానం స్పష్టంగా సిట్‌ను అభ్యంతరాలను మూడు రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సిట్ ఈ కేసులో రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది.
రేవంత్ చేసే ప్రతీ తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, “ప్రజలు బీఆర్ఎస్‌ను పక్కనబెట్టి, బీజేపీ–కాంగ్రెస్‌లకు చెరో ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. కానీ ఇన్ని నెలలుగా 16 మంది ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారు? ఒక్క రూపాయి కూడా రాలేదు” అని విమర్శించారు.
ఖైరతాబాద్ మహా గణపతికి ఘన ఆగమన్.. 2 రోజుల ముందుగానే గణేషుడి దర్శనం
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతం మరోసారి మహా గణనాథుడి ఆగమన్‌తో పండుగ వాతావరణంలో మునిగిపోయింది. డీజెల హోరు, యువత కేరింతలు, భక్తుల జయజయకారాలతో ఖైరతాబాద్ మహా గణపతికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రత్యేకంగా మరాఠీ బ్యాండ్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆగమన్ మరింత వైభవంగా సాగింది. ఈసారి రెండు రోజుల ముందుగానే భక్తులకు దర్శనం కల్పించిన ఖైరతాబాద్ మహా గణపతి, 71వ ఏట 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మహాద్భుతంగా అలంకరించబడ్డాడు.
సినిమా చెట్టుకు పునర్జీవం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరంలో ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300కి పైగా చిత్రాలకు సాక్షిగా నిలిచిన ఈ నిద్రగన్నేరు వృక్షం, దర్శకులు, నటులు మరియు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోవడంతో సినీ ప్రియులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టును కాపాడాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. ఈ సవాలును స్వీకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, గ్రీన్ భారత్ – వనం మనం విభాగం ఆధ్వర్యంలో ఈ చెట్టును పునరుజ్జీవం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద నిర్వాహకులు చెట్టుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా, చెట్టు వేరు మధ్య ఒక కొత్త అంకురం జీవం పోసుకుంది. ప్రస్తుతం ఈ అంకురం 10 అడుగుల ఎత్తున మొక్కగా పెరిగింది.
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ఏడుగురు ప్లేయర్స్‌కు ఇదే మొదటిసారి! కప్ గెలుస్తారా భయ్యా
2025 మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టు సారథిగా వ్యవహరించడం సనాకు ఇదే తొలిసారి కావడం విశేషం. సనాకు డిప్యూటీగా మునీబా అలీ ఎంపికయ్యారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ లాంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. జట్టులో ఐదుగురు ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఉన్నారు.
రూ.20 వాటర్ బాటిల్‌కు 100 దేనికి? .. రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీల తీరును తప్పుబట్టింది. విక్రయించే వాటిపై ఎమ్మార్పీ కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ల సంఘాలను నిలదీసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం, భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య పిటిషన్ దాఖలు చేశాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు
హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించిన వివరాల ప్రకారం, గచ్చిబౌలి ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
