అగ్నిప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధం.. 40 ఇళ్లు బూడిద
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోండాలోని ధనేపూర్ ప్రాంతంలోని చకియా గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామం మొత్తం దగ్ధమైంది. ఇక్కడ దాదాపు 40 ఇళ్లకు చెందిన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగడంతో ఒక గేదె సజీవదహనం కాగా, ఓ మహిళ దగ్ధమై చికిత్స పొందుతోంది. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ధనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజ్రా చాకియా గ్రామంలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి బూడిదగా మారింది. పెద్దఎత్తున మంటలు రావడంతో ఒక్కసారిగా కేకలు వచ్చాయి. మంటల్లో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలు, పశువులను రక్షించేందుకు ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు..
మాజీ మంత్రి సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అని, గత ఎన్నికల్లో ఎన్నికల అధికారి పెట్టిన కేసులో నా పేరు ఉందని సోమిరెడ్డి నిరూపించగలరా..? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పాలనలో కేసులు నమోదు చేసారా.. లేక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదైందా.. ..చెప్పే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ఆయన అన్నారు. మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కు, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా.. అని ఆయన వ్యాఖ్యానించారు.
నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్
నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్ రావు కు మంత్రి కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు..నాటకాల రాయుడు అన్నారు. పెద్ద జోకర్ గా మారిపోయాడన్నారు. రాజీనామా ప్రొఫార్మలో ఇస్తార అనుకున్నారు ప్రజలు అంటూ వ్యంగాస్త్రం వేశారు. రాజీనామా లేఖ చూస్తే పెద్ద జోకర్ అని ప్రూవ్ అయిపోయిందన్నారు. హరీష్ రావు అనాలా.. హౌల రావు అనాలా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకుల చంపిన వ్యక్తి హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తాం అని సీఎం చెప్పారన్నారు.
స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు.. హరీష్ కు రేవంత్ కౌంటర్…
స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదన్నారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా లేఖ అలా ఉండదని పేర్కొన్నారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని స్ఫష్టం చేశారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని అన్నారు. హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామన్నారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. నీ రాజీనామా రెడీగా పెట్టుకోవాలని సవాల్ విసిరారు.
రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరో కార్యక్రమం లేదని, జగన్ ను నన్ను విమర్శించేది పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ మాడా అని మాట్లాడారని, చంద్రబాబు రాయలసీమ నుండి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాయలసీమ లో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పం లో ఓడిపోతాను అని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని, అందుకే తిట్ల పురాణం కు తెర తీశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం..!
హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వమని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు అన్నారు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగిందన్నారు. 10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారన్నారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారన్నారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వనని తెలిపారు.
ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. రెండు రోజులుగా జరుగుతుంది ఇదే
ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. రెండు రోజులుగా జరుగుతుంది ఇదే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్.. లాంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చారన ఆయన తెలిపారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలాని పార్టీ సూచించిందని, నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరుతా అన్నా..చేర్చుకుంటామన్నారు జగ్గారెడ్డి. ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందాం.. మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమేనని, కాబట్టి వాళ్ళ నిర్ణయం పాటించాల్సిందేనన్నారు జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్.. ప్రియాంకదని, మనం వాళ్ళ నీడలో రాజకీయంగా బతుకుతున్నామన్నారు జగ్గారెడ్డి.
బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
ఏపీలో ఎన్నికల హడావుడి గట్టిగానే ఉంది. నిన్నటితో నామినేషన్ల గడువు పూర్తి కాగా ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా లోక్ సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్ సెట్లు దాఖలు అయ్యాయి. వచ్చిన నామినేషన్ల సెట్లను ఎన్నికల అధికారులు స్క్రూట్నీ చేయనున్నారు. గతంలో కంటే ఈసారి ఇండిపెండెంట్లు, డమ్మీ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే రెండు.. మూడేసి సెట్లు దాఖలు చేసినట్టు చెబుతున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నట్టు చెబుతున్నారు. స్క్రూట్నీలో ఓకే అయ్యాక నామినేషన్లను డమ్మీ అభ్యర్థులు ఉపసంహరించుకోనున్నారు. ఇక ఈ నెల 29 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాజేందర్ రావుని గెలిపించండి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాజేందర్ రావు నీ గెలిపించండని ఆయన కోరారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎప్పుడైనా అన్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె అదానీ అంబాణీలకు ఇచ్చిన ఆస్తులు గుంజుకొని పేదలకు పంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే వానాకాలం పంట లోపు వరికి బోనస్ చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్ రావు.
రాజేందర్ అన్న నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు. అసలు ఏమైందంటే.. ఓ పెళ్లి వేడుకలో ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఈటలను ఆలింగనం చేసుకుని..” నివ్వే గెలుస్తావ్ అన్న” అని వ్యాఖ్యానించారు. ఫోటో తీయ్యి మా అన్నతోటి అంటు ఈటలతో ఫోటో దిగారు మల్లారెడ్డి. నువ్వు ఎక్కడో.. నేను ఎక్కడో.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో.. ఏమో అంటు చేతిలో చెయ్యి వేసి మాట్లాడిన ఆయన అక్కడి నుంచి వెళ్లి పోయారు.
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది..
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్.. పదేళ్ల క్రితం ఇటలీ కాంగ్రెస్ ను దేశ ప్రజలు వదులుకున్నారన్నారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలు ఈ దరిద్రాన్ని మళ్లీ దరికి చేరనివ్వరని ఆయన అన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని పిచ్చి వాదనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ బ్రిటిష్ సంప్రదాయాలను కొనసాగిస్తుందన్నారు కిషన్ రెడ్డి. దేశాన్ని విభజించు, పాలించు విధానాన్ని అవలంభిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లు ఇటలీ కోసం పుట్టారు.. ఇటలీ కోసమే చస్తారన్నారు.
