తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు శైలజనాథ్, ఇతర వైసీపీ నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను లెక్క పెడుతున్నాం.. పాలకులకు, వైసీపీకి మధ్య పోలీసులు ఉన్నారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
బర్త్ డే రోజు ఈడీ షాక్.. లిక్కర్ కేసులో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఈడీ షాకిచ్చింది. మద్యం కేసులో భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. భిలాయ్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈడీ వాహనాలకు అడ్డుతగిలారు. భారీగా పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఆందోళనకారుల్ని పక్కకు నెట్టి చైతన్య కారును ముందుకు పోనిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు చైతన్యది పుట్టినరోజు. శుక్రవారమే అరెస్ట్ చేయడంపై మాజీ ముఖ్యమంత్రి బాఘేల్ ఆవేదన వ్యక్తం చేశారు. భూపేశ్ బాఘేల్ అసెంబ్లీలో ఉన్నప్పుడు కుమారుడిని అరెస్టు చేశారు.
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడిని హ*త్య చేసిన యువతి బంధువులు
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ చేసినట్లు తెలిపారు. మా కొడుకు ఆ అమ్మాయిని మర్చిపోయినప్పటికీ ఆమె మాత్రం వదలకుండా ఫోన్స్ చేస్తుందని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి పెట్టాలి..
గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలి సారి ప్రారంభించింది నేనే.. సంస్కరణలు అమలు చేసిన కారణంగా నేను అప్పట్లో అధికారం కోల్పోయాను.. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. గ్లోబల్ వార్నింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం పెరిగింది.. విద్యుత్ తయారీ సంస్థలు ఈ విషయంపై పరిశోధనలు చేయాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏ రోజైనా అభివృద్ధి గురించి ఆలోచించారా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఫైర్
ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీపై నిప్పులు చెరిగారు. బీహార్‌లో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తూర్పు భారతదేశంలో సమగ్ర అభివృద్ధికి ‘విక్షిత్ బీహార్’ ఎంతైనా అవసరం ఉందని చెప్పారు. యూపీఏ, ఆర్జేడీ ప్రభుత్వాల కాలంలో కేవలం రూ.2లక్షల కోట్ల గ్రాంట్లు మాత్రమే మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపిస్తే.. సరికొత్త బీహార్‌ను చూపిస్తామని హామీ ఇచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ చీఫ్ కె నాగరత్న తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 33 జిల్లాల్లో కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరియు బలమైన గాలులు కూడా సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో పబ్ యజమానలకు షాక్..
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది. దీంతో వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేరొన్నాడు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని పబ్ యజమానులు హైకోర్టుకు వెళ్లారు. ఈ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది..
2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
అమరావతి లో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ నిర్మాణం పై దృష్టి పెడతామన్నారు సీఎం చంద్రబాబు… రెండు రోజుల గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.. ఎస్ ఆర్ ఎం లో జరుగుతున్న రెండు రోజుల సమిట్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని తను బలంగా కోరుకుంటున్నా అన్నారు. గతంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదని.. చాలా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదన్నారు.. కరెంట్ కోతలు, లో వోల్టేజ్ సమస్యల పై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడేవారని.. తాను1999లో మొదటగా విద్యుత్ సంస్కరణలు అమలు చేశానన్నారు.. నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. రోడ్లపై నీటిమునిగిన రోడ్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) వెల్లడించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకోవడంతో GHMC, జలమండలి, హైడ్రాఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
