ప్రజలు దీన్ని సహించరు.. అజిత్ పవార్ తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. షిండే-ఫడ్నవీస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 40 మంది అజిత్ పవార్ వెంట నిలిచారు. ఆదివారం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా మంత్రి వర్గంలో చేరగా.. మరో 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఎన్పీపీలో చీలక గురించి తాను ఇప్పుడే శరద్ పవార్ తో మాట్లాడానని ఉద్దశ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ‘‘కొందరు మహారాష్ట్ర రాజకీయాలను శుభ్రం చేసే పనిని చేపట్టారు.. వారిని అదే పనిలో ఉండనివ్వండి.. నేను శరద్ పవార్ తో ఇప్పుడే మాట్లాడాను.. నేను బలంగా ఉన్నానని, ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మళ్లీ అన్నింటిని పునర్నిర్మిస్తాం శరద్ పవార్ చెప్పారు’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
గ్రామాలలో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు
ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయన మాట్లాడుతూ.. సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పోలీసులు అడుగడుగునా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని, సభకు రాకుండా ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్ ప్రైవేటు వెహికల్స్ ని కూడా రానివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రియుడి తో రాసలీలలు చేసేందుకు అడ్డుగా ఉన్న కొడుకును చంపిన తల్లి.. చివరికి..
ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ కు చెందిన 22 ఏళ్ల నయన మాండవి అనే మహిళ గుజరాత్ లోని సూరత్ జిల్లాలో నివసిస్తోంది. దిండోలీ ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తోంది. అయితే ఆమె జూన్ 27వ తేదీన తన రెండేళ్ల కుమారుడు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ పని చేస్తున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అందులో పిల్లాడు బయటకు వచ్చినట్టుగా ఎలాంటి అనవాళ్లు కనిపించడం లేదు. దీంతో బాబు నిర్మాణ స్థలం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు..
బాబు ఆచూకి కోసం అన్ని విధాలుగా ప్రయత్నించారు.. పోలీసులకు తల్లి నయన మాండవిపై అనుమానం వచ్చింది. కుమారుడి అదృశ్యంపై పోలీసులు ఆమెను విస్తృతంగా ప్రశ్నించారు. కానీ ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో పోలీసులు సంతృప్తి చెందలేదు. ఇలా ప్రశ్నిస్తున్న సమయంలోనే నివసిస్తున్న తన ప్రియుడిపై ఆమె ఆరోపణలు చేసింది. అతడే తన బిడ్డను కిడ్నాప్ చేశాడని తెలిపింది. దీంతో ప్రియుడిని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు విచారణలో అతడెప్పుడూ సూరత్ కు రాలేదని తేలింది. దృశ్యం సినిమా చూసిన ఈమె అదే స్టైల్లో బాలుడిని చంపి శవాన్ని మాయం చేసింది.. పోలీసుల ప్రశ్నలతో మొత్తం నిజం కక్కింది.. ప్రస్తుతం ఈ ఘటన తో స్థానికంగా కలకలం రేపుతుంది.
పాపం.. రైల్వే ప్లాట్ ఫాంపై పడుకున్న వాళ్లపై నీళ్లు పోసిన ఓ పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో..!
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్ లో వారు ఎక్కవలిసిన రైలు కోసం ఎదురుచూస్తూ.. పలువురు ఆ రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోయారు. ఇందులో వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారి ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ వృద్ధులు, యువకులపై నీళ్లు చల్లారు. దీంతో వాళ్లు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఐపీ హ్యుమానిటీ’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. కేవలం ట్విట్టర్ లోనే 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.
అంతేకాకుండా.. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఆ పోలీస్ ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. ప్లాట్ ఫాంలపై నిద్రిస్తున్న ప్రయాణికుల సమస్యను పరిష్కరించే మార్గాలను కనుగొనాలని సూచించారు. ఓ యూజర్ ‘‘ఇది దారుణం. రైలు కోసం వేచి ఉన్నప్పుడు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అమానుషం.’’ అని అన్నారు.
బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యింది.. మాణిక్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో మహారాష్ట్రలో కేసీఆర్ తన పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఓడిద్దామనుకుంటున్నారని.. కానీ అది సాధ్యం కాదన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని అందరికీ అర్థమైపోయిందన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ పాల్గొంటుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెస్తుందని మాణికే ఠాక్రే పేర్కొన్నారు. ఖమ్మంలో భారీ సభ జరగుతోందన్నారు. భట్టి పాదయాత్ర ముగిసిందని తెలిపిన ఠాక్రే.. అలాగే చేరికలు ఉన్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలు కేసీఆర్ నేరవేర్చలేదని ఆయన విమర్శించారు.
“యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వంటి పార్టీలు దీనికి మద్దతు తెలిపుతున్నాయి. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి కూడా తాను యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అమలు చేస్తున్న పద్ధతే సరిగ్గా లేదని ఆమె ఆరోపించారు.
హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదు
8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని ఆయన విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకరో ఇద్దరో చేరినంత మాత్రాన కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన మండిపడ్డారు.
సంజయ్ సాహో గుర్తొస్తున్నాడు ‘బ్రో’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రో మూవీ మరింత బజ్ ని జనరేట్ చేసింది. అనౌన్స్మెంట్ సమయంలో అసలు అంచనాలు లేని ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ డే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి అంటే ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజ్ సౌండ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్ స్టఫ్ ని సినిమా మొత్తం లోడ్ చేసిన సముద్రఖని, ఫాన్స్ పై ఫైర్ చేయడానికి రెడీ అయ్యాడు.
