శ్రీశైలం జలాశయానికి పోటేత్తిన వరద
గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్‌లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. ఇప్పటికే గత వానకాలంలో వచ్చిన వరదలతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. తాజాగా మరోసారి జూరాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తోంది. అధికారులు పేర్కొన్న ప్రకారం, ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అయితే, శ్రీశైలంలో ప్రస్తుతం ఔట్‌ఫ్లో లేదు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం!
తమిళనాడులో కార్తికేయుడి భక్తులతో నేడు బీజేపీ నిర్వహిస్తూన్న మురుగన్ మహా భక్త సమ్మేళనం రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దానికి కారణం అయ్యింది. అమ్మ తిడల్, పాండికొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఎన్నికలకు ఎడాది ముందుగానే సై అంటే సై అంటున్న పార్టీలు.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అడుగులు వేస్తున్నాయి. మధురై వేదికగా జరగనున్న సుబ్రహ్మణ్యస్వామి భక్తుల మనాడుపై రాజకీయ రచ్చ మొదలైతే.. ముగింపు డిప్యూటీ సీఎం పవన్ ఎలా ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది.
మరోసారి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడికి దిగింది. జెరూసలేం, టెల్ అవీవ్ తదితర ప్రధాన ప్రాంతాలపై క్షిపణుల దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ భద్రతా దళాలు, రెండు ఇరానియన్ డ్రోన్లను ఆకాశంలోనే తాకట్టు చేయగలిగాయి. ఇరాన్ నుంచి పెరుగుతున్న దాడుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, అమెరికా కూడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను గట్టిచేసింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఉన్న మతపరమైన మరియు సాంస్కృతిక కేంద్రాలు, ఇరాన్ రాయబార కార్యాలయాల పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు!
ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్‌ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు.
ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన సల్మాన్..
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. ముందు పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సల్మాన్.. ‘వివాహం అంటే భావోద్వేగపరంగా, ఆర్థికపరంగా చాలా కఠినమైన అంశం. ఒక్క సంబంధాన్ని కొనసాగించడం అంత సులభం కాదు’ అని తెలిపారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు.. ‘ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయి. నాకు ట్రైజెమినల్ న్యూరల్జియా (ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి), ఏవీ మాల్ఫోర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి), బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే చిన్నపాటి నొప్పి). ఇవ్వని ఉన్నప్పటికీ వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే దానిని అధిగమించేవాడిని. ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారింది
కరీంనగర్‌లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మోదీ ప్రభుత్వ విధానం క్లియర్ – అవినీతిని తహతహలాడిపోవడం. ఊసరవెల్లిలా స్టాండ్ మారించే పార్టీ కాదు బీజేపీ’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కన్నడలో మరో కాంట్రవర్సీ.. ఈ సారి హీరోయిన్ వంతు
ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమ కాస్త ప్రశాంతతను పొందుతుందీ అనుకునే లోపు మరో కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది. లాస్ట్ ఇయర్ అంతా దర్శన్ ఇష్యూ, రీసెంట్లీ కమల్ భాషా వివాదం సద్దుమణిగిందిలే అని ఫీలవుతుంటే. స్టార్ హీరోయిన్ రచితా రామ్ వల్ల టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇంతకు మేడమ్ ఏం చేసిందంటే నయన్ తారలా ప్రమోషన్లకు డుమ్మా కొడుతుందట. శాండిల్ వుడ్ స్టార్ డైరెక్టర్ నాగశేఖర్ తెరకెక్కించిన ఫిల్మ్ సంజు వెడ్స్ గీతా 2. 2011లో వచ్చిన సంజు వెడ్స్ గీతాకు సీక్వెల్. ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తే పెద్దగా ఆడలేదు. దీంతో జూన్ 6న రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.
బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే!
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్, వైసీపీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ మంచి పాలన కారణంగానే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు.
కవితకు బీసీలు ముందుకు వచ్చి అండగా ఉండాలి
తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలన్న డిమాండ్‌తో మేము ఉద్యమం చేపట్టాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే బిల్లులు పాస్ చేసి, రాష్ట్రపతికి పంపించామని చెప్పి చేతులు దులుపుకుంటోంది,” అని విమర్శించారు.
