Bandi Sanjay: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై బండిసంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Kajal Karthika OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ మూవీ..
ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో రైతు దీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా నిన్న సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.
Read also: Astrology: ఏప్రిల్ 2, మంగళవారం దినఫలాలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమలుతోపాటు యుద్ద ప్రాతిపదికన నష్ట పరిహారం అందజేయాలని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యమ సైరన్ ను మోగించారు బండి సంజయ్. దీంతోపాటు ఏప్రిల్ తొలి వారం నుండి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేయించడంతోపాటు తాలు, తేమ పేరుతో వడ్ల తరుగు లేకుండా రైతుల నుండి పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేేయించడమే లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
Read also: Hardik Pandya: నా తప్పిదం వల్లే ఈ పరాజయం: హార్దిక్ పాండ్యా
వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్ల కల్లాల దగ్గర బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించారు. దీంతోపాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.
Read also: Hardik Pandya: నా తప్పిదం వల్లే ఈ పరాజయం: హార్దిక్ పాండ్యా
బీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే…
* పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
* తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి.
* తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
* ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి.
* రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి.
* మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానక్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి.
* ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలి.
* సమగ్ర పంటల బీమాన అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి.
* కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి.
Off The Record : TDP వద్దనుకున్న నేతకి Janasena టికెట్ ఎందుకు ఇచ్చింది..?