Cyberabad Police: ఎయిర్ పోర్ట్ వెళ్ళే వారు టికెట్ చూపించి ఓఆర్ఆర్ లో వెళ్ళాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే వారు…నిబంధనలకు లోబడి చేసుకోవాలన్నారు. ప్రజలు సురక్షితంగా, కుటుంబ సభ్యుల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్లేస్ లలో సంబరాలు చేసుకునే వారు… చట్టానికి లోబడి చేసుకోవాలన్నారు. ఈ రాత్రి నుండి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు వుంటాయని క్లారిటీ ఇచ్చారు. ఫ్లైఓవర్ లు మూసివేస్తాము..ఓఆర్ఎస్ కూడా మూసి వేస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ వెళ్ళే వారు టికెట్ చూపించి ఓఆర్ఆర్ లో వెళ్ళాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తామన్నారు. బైక్ లపై ఫీట్ లు చేస్తూ..ప్రజలకు అసౌకర్యం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరిస్తామన్నారు.
Read also: Blinkit: వీడు పోటుగాడే.. బ్లింకిట్ నుంచి ఒక్కడే 10 వేల కండోమ్‌లకు ఆర్డర్
డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని కమర్షియల్ వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు …కేబుల్ బ్రిడ్జి , ఔటర్ , ఫ్లైఓవర్ లు మూసివేస్తామన్నారు. ఆటోలు, క్యాబ్ లు బుక్ అయ్యాక కాన్సిల్ చేస్తే…చర్యలు తప్పవన్నారు. వారం రోజులుగా…కమిషనరేట్ లోని అన్ని ఫార్మ్ హౌజ్ లలో తనిఖీలు చేసామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే… కటిన చర్యలు తప్పవన్నారు. ఈ ఈవెంట్ కు అయినా పోలీస్ ల అనుమతి తీసుకోవాలన్నారు. సంబర్న్ ఈవెంట్ కి సరి అయిన ఏర్పాట్లు , సౌకర్యాలు లేవని అనుమతి నిరాకరించామని తెలిపారు. పోలీస్ ల అనుమతి లేకుండా … బుకింగ్స్ చేసినందుకు కేసులు నమోదు చేసామన్నారు.
Devara Teaser: టైగర్ ఫ్యాన్స్ అసెంబుల్…