Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అక్కడక్కడ భారీ వానలు పడుతున్నాయి. చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, బర్కత్ పురా, కార్వాన్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్‌నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, కాచిగూడ, జల్పల్లిలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కారణంగా నాళాల నిండి నుంచి నీరు పైకి రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లవద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read
Read also: Karnataka: ముస్లిం మహిళకు రైడ్ ఇవ్వడంతో.. యువకుడిపై దాడి.. చివరకి..
ఇక నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండలో వర్షం కురిసింది. మరోవైపు ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది.
Wife Killed Husband: తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. మామతో కలిసి భర్తను చంపిన భార్య
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!