Tummala Nageshwar Rao: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్.. జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నేతలను పెద్దఎత్తున ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలో బిజీగా ఉన్నారు.
Read also: Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారు
ఆదివారం సభ నిర్వహణకు సంబంధించి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో గులాబీ నేతలు సమావేశమయ్యారు. కాగా.. ఎంపీ నామా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రయోజనాలు కోసం వేరే వ్యక్తులతో మీరువెళితే అది మీకర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి లేని విధంగా మన రాష్ట్రంలో ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలిగుదేశం జాతీయ పార్టీగా ఏర్పడింది అలానే ఇప్పుడని అన్నారు. దేశ రాజకీయాలను మలువు తిప్పే విధంగా పార్టీ అధ్యక్షుడు అడుగు వేస్తున్నాడని, 70 సంవత్సరాల స్వతంత్రలో ఎందుకు వెనుకపడ్డాం.. దేశం ముందుకు తుందని అన్నారు.
Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి
ఢిల్లీలో జరగాల్సిన సభను ఖమ్మం జిల్లాలో పెడుతున్నారంటే మన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరే తెలుసుకోవాలని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయైతే మీకు కావాల్సి నీరు వస్తుంది. 10 లక్షలు ఎకరాలుకు నీరు అందిస్తున్నామన్నారు. మన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లనే దేశంలో ఆయిల్ పామ్ రేటు పెరిగిందనా అన్నారు. అశ్వారావుపేట అంటే ఆయిల్ పామ్ పంట సాగు కోసం కేరాఫ్ అడ్రస్ అన్నారు. 80 వేల కోట్లు ద్రవ్యం విదేశాలకు వెళ్తుందన్నారు. పామ్ ఆయిల్ సాగు విషయంలో ఎవరు మనేది చెందాడని తెలిపారు. మీసం మీద చెయ్యి వేసుకుని, కాలుమీద కాలు వేసుకునే విధంగా కేసీఆర్ మన రాష్ట్రంలో ప్రజలను నిలబెట్టారని తెలిపారు. అలానే దేశ ప్రజలు కూడా.. అలానే ఉండాలని kcr ఆకాంక్షించారన్నారు. 18 వ తేదీ ఒక్క రోజు కష్టపడండని పిలుపు నిచ్చారు.
Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..