Thummala Nageswara Rao: బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు.. స్కాములయ్యాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని బాలాజీ గార్డన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా రెచ్చగొట్టి అధికారం, అవకాశాల కోసం.. సార్వబౌమధికారం, సమగ్రత ను విచ్ఛిన్నం చేయాలని చుస్తున్న బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందన్నారు.
Read also: US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు
బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు.. స్కాములయ్యాయని మండిపడ్డారు. లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు నిరూపయోగమయ్యాయని ధ్వజమెత్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఏ ఒక్క రైతు పంటలు నష్టపోవద్దని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే భీమా ప్రీమియం చెల్లించి, పంటల భీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తుందని, పంట నష్టపోయినా, దిగుబడులు తగ్గినా పంట నష్ట పరిహారం అందుతుందని, 6 గ్యారెంటీలలో 5 అమలు చేశామని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీనిచ్చారు. కేంద్రం నుంచి పోడు భూములకు పట్టాలు, జాతీయ రహదారుల మంజూరు అనుమతులు త్వరిత గతిన తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Game Changer : ఫైనల్ స్టేజ్ కు గేమ్ చేంజర్ షూటింగ్.. మరి రిలీజ్ ఎప్పుడంటే..?