తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా నిరాశ తప్పేలా లేదు.. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని రోజులు ఎన్నికల కోడు.. ఆ తర్వాత జాప్యం.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు.. ఈ నెల కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోంది.. ఉద్యోగులకు మే నెల కూడా పాత జీతాలే రానున్నాయని చెబుతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కరోనా వైరస్ విజృంభణ, ఇతర కారణాలతో పెండింగ్ పడుతూనే వస్తోంది.. అయితే, వచ్చే నెల (జూన్ నెల) కొత్త జీతంతో పాటు ఏప్రిల్, మే బకాయిలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని అంటున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు.. అంటే.. మొత్తం కలిపి.. జులై 1వ తేదీన పడే జీతంలో పడే అవకాశం ఉందన్నమాట.