Bhadrachalam: గోదావరి మహాగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయన్న పేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిశా ఛత్తీస్‌గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగులోనూ ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.54 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సహాయక చర్యల్లో నాలుగు NDRF, 4 SDRF బృందాలు పాల్గొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సూచించింది.
Read also: Hyderabad MMTS: అలర్ట్.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు రైళ్ల రద్దు
మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వరద రావడంతో త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరుకుంది. దీంతో పుష్కరఘాట్ మెట్ల నుంచి రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 13.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. దీంతో 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువనున్న అన్నారం బ్యారేజీకి 5.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండటంతో 66 గేట్లను ఎత్తి 5.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నిజాం సాగర్ ప్రాజెక్టుకు 20 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1404.66 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. అదేవిధంగా 17.802 టీఎంసీల్లో 17.311 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండిసంజయ్