Site icon NTV Telugu

MP Nama Nageshwar Rao: ఎంపీ కుమారుడికే తప్పని తిప్పలు.. బెదిరించి నగదుతో మాయమైన దుండగులు

Mp Nama Nageshwar Rao

Mp Nama Nageshwar Rao

ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్‌ విసిరారు దుండగులు.

read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్‌ చేస్తే రూ.25లక్షలు మాయం

వివరాల్లోకి వెళితే.. ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి కొందరు దుండగులు రూ.75 వేలు లాక్కొని పరారైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరంలోని టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా, దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. కారులో బలవంతంగా చేరిన దుండగులు కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు. కారులోంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. నగరంలో కాసేపు అటూఇటూ కారును తిప్పారు. నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపారు. పృథ్వీని కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొన్నారు. కారును పంజాగుట్ట వద్ద తీసుకుని వచ్చి దుండగులు దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పంజాగుట్ట పీఎస్‌లో ఎంపీ కుమారుడు పృథ్వీ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

అయితే ఎంపీ కొడుకునే కారులో ఎక్కి అతని వద్ద నుంచి బెదిరించి డబ్బులు కాజేసిన దుండగులకు సామాన్య ప్రజలు ఓ లెక్కనా అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నగరాన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపీడీలకు ఆష్కారం లేకుండా సీసీ ఫోటేజీ ఏర్పాటు చేసామని చెబుతున్న పోలీసులు మరి ఎంపీ కొడుకునే బెదిరించి డబ్బులు కాజేసీన దుండుగుల కేసు సవాల్‌ గా మారిందని స్థానికులు చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి మరి.

కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దొంగను పట్టుకున్నారు. బెంగళూరు సదాశివనగర్​లోని మంత్రి నివాసంలో గతంలో సుమారు రూ.కోటి విలువైన నగదు, వస్తువులు చోరీ అయ్యాయి. ఇందులో రూ.85 లక్షల విలువైన విదేశీ నగదు, ఆరు ఖరీదైన వాచీలు పోయాయని.. మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా దొంగను పట్టుకున్నారు.

20 Years Of Avunu Valliddaru Ista Paddaru: 20 ఏళ్ళ కిందట ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’..!!

Exit mobile version