Y. S. Sharmila: వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచాళ వ్యాక్యలు చేశారు. పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ కట్టడి చెయ్యడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేసి, పాదయాత్ర ఆపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఅర్ కి తెలిసింది ఒకటే.. ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు. నేను వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిలను. మీకు దమ్ముంటే నన్ను ఆపండి అని సవాల్ విసిరారు. మా పై నిరంజన్ రెడ్డి పిర్యాదు చేస్తే వెంటనే FIR ఫైల్ చేశారు. అదే నిరంజన్ రెడ్డి మీద మేము పిర్యాదు చేస్తే యాక్షన్ లేదు అని మండిపడ్డారు. కనీసం FIR కూడా నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరదలు అని అసభ్యకర పదజాలంతో దోషిస్తే కేసు పెట్టడం లేదు. నా ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారు. నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణలో మహిళల మీద గౌరవం? అని మండిపడ్డారు.
తెలంగాణలో మంత్రుల మీద కేసులు వేయకూడదా…? డైరెక్ట్ గా చెప్పండి. మేము మంత్రుల మీద కేసులు నమోదు చేయం అని. నేను వైఎస్సార్ బిడ్డ అయి ఉండి కూడా కేసు పెడితే నమోదు చేయడం లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి..? అని ప్రశ్నించారు. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమే.. తెలంగాణలో ప్రజా స్వామ్యమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు. పోలీస్ శాఖ ను టీఆర్‌ఎస్ లో విలీనం చేయండి అని షర్మిల మండిపడ్డారు. RSS లా trs కి ఒక సైన్యం లా పని చేయండి. మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండి. నా పేరు వైఎస్ షర్మిల..నేను వైఎస్సార్ బిడ్డను. గుర్తు పెట్టుకో కేసీఅర్.. నేను పులి బిడ్డను. వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు. నా గొంతు నొక్కడం, నన్ను ఆపడం మీ తరం కాదు. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారన్నారు. తెలంగాణలో ఏ మహిళ నైనా అడగండి మరదలు అంటే చెప్పుతో కొడతారా..లేదా? రైతుల మీద ప్రేమ లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను సినిమా టిక్కెట్లు తో పోల్చారు. ఉద్యోగాలు అడిగితే హమాలి పని చేసుకో అంటారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Y. S. Sharmila: అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఓ..అవినీతి మంత్రి మరదలు అంటే తప్పులేదట