NTV Telugu Site icon

Lovers Chain Snachers: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న లవర్స్.. ఖంగుతిన్న పోలీసులు

Lovers Chain Snaching

Lovers Chain Snaching

Lovers Chain Snachers: ప్రేమికులంటే ఏం చేస్తారు. అదేం ప్రశ్న అనుకుంటున్నారా? ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇంకా అంటే సెల్‌ ఫోన్‌, చాటింగ్ లో బిజీ బిజీ.. ఇంకా చెప్పాలంటే పార్కలు, సినిమాల్లో కార్నర్‌ సీట్లు, ఒక కూల్‌ డ్రింక్‌ లో ఒక స్ట్రా వేసుకుని తాగడం. లవర్‌ కు బైక్‌ ఉంటే అందులో ఫుల్‌ పెట్రోల్‌ ఉంటే షికార్లు మామూలుగా ఉండదు. అంతేనా బైక్‌ పై స్టంట్‌ లు.. షాపింగ్స్‌, ఇష్టమైన గిప్టులు కొనిపెడుతుంటారు. అయితే ఇప్పుడు చేప్పే లవర్స్‌ మాత్రం మహా ముదుర్లు.. వీరి ప్రేమ ముందు ఎవరి ప్రేమైనా దిగదుడుపే.. ఒకరినొకరు ఎంతలా అర్థం చేసుకుంటారంటే ఎక్కడైనా సరే ఒకరు విడిచి ఇంకొకరు ఉండలేరనే చెప్పాలి. ఏ పనిలోనైనా నువ్వునేను అన్నట్లు బతికేస్తున్నారు. వీరిద్దరు సినిమాలు బాగా ఫాలో అయినట్లు ఉన్నారు. అందుకే ఓ రేంజ్ లో సినిమా స్టైల్ లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకరు స్కూటీ నడిపితే.. మరొకరు చైన్‌ లాగడం అదేంటి రైల్‌ లోని చైన్‌ కాదండో మహిళ మెడలోని చైన్‌ అన్నమాట. అక్కడి నుంచి ఓ రేంజ్‌ లో పరారవడం.. స్థానిక సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్లొండ జిల్లాలో ఈ లవర్స్ స్నాచింగ్ ఘటన వెలుగుచూసింది.

Read also: Sadhus: బెంగాల్ లో సాధులపై దాడి.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం

చైన్‌ స్నాచర్ లవర్స్ కథ..

నల్లొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అక్కడి నుంచి ఓ స్కూటీ పై ఇద్దరూ ఓ జెట్ స్పీడ్ లో అమె వద్దనుంచి వెళ్ళారు. అంతే ఆమె మెడలోని గొలుసు మాయమైంది. అంతేబాధితురాలు తేరుకునే సరికి స్కూటీ చాలా దూరం వెళ్లిపోయింది. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు దంపతులను పట్టుకునేందుకు స్కూటీపై వెంబడించారు. ఇద్దరూ జెట్ స్పీడ్‌తో పారిపోయారు. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా అందులో ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్కూటీపై చైన్ స్నాచింగ్ చేయడం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. భలే దొంగలు సినిమాలో రియల్ లైఫ్ సీన్ క్రియేట్ చేయడంతో.. ఈ కిలాడీ ప్రేమికులను పట్టుకునేందుకు డీసీపీ దేవరకొండ రంగంలోకి దిగారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఆ ప్రేమ పక్షులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.
Rajasimha Tadinada: స్టార్ ప్రొడ్యూసర్ పై అనుచిత వ్యాఖ్యలు… రైటర్ పై పోలీస్ కేస్