Lovers Chain Snachers: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న లవర్స్.. ఖంగుతిన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers Chain Snachers: ప్రేమికులంటే ఏం చేస్తారు. అదేం ప్రశ్న అనుకుంటున్నారా? ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇంకా అంటే సెల్ ఫోన్, చాటింగ్ లో బిజీ బిజీ.. ఇంకా చెప్పాలంటే పార్కలు, సినిమాల్లో కార్నర్ సీట్లు, ఒక కూల్ డ్రింక్ లో ఒక స్ట్రా వేసుకుని తాగడం. లవర్ కు బైక్ ఉంటే అందులో ఫుల్ పెట్రోల్ ఉంటే షికార్లు మామూలుగా ఉండదు. అంతేనా బైక్ పై స్టంట్ లు.. షాపింగ్స్, ఇష్టమైన గిప్టులు కొనిపెడుతుంటారు. అయితే ఇప్పుడు చేప్పే లవర్స్ మాత్రం మహా ముదుర్లు.. వీరి ప్రేమ ముందు ఎవరి ప్రేమైనా దిగదుడుపే.. ఒకరినొకరు ఎంతలా అర్థం చేసుకుంటారంటే ఎక్కడైనా సరే ఒకరు విడిచి ఇంకొకరు ఉండలేరనే చెప్పాలి. ఏ పనిలోనైనా నువ్వునేను అన్నట్లు బతికేస్తున్నారు. వీరిద్దరు సినిమాలు బాగా ఫాలో అయినట్లు ఉన్నారు. అందుకే ఓ రేంజ్ లో సినిమా స్టైల్ లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకరు స్కూటీ నడిపితే.. మరొకరు చైన్ లాగడం అదేంటి రైల్ లోని చైన్ కాదండో మహిళ మెడలోని చైన్ అన్నమాట. అక్కడి నుంచి ఓ రేంజ్ లో పరారవడం.. స్థానిక సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్లొండ జిల్లాలో ఈ లవర్స్ స్నాచింగ్ ఘటన వెలుగుచూసింది.
Read also: Sadhus: బెంగాల్ లో సాధులపై దాడి.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం
Also Read
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
చైన్ స్నాచర్ లవర్స్ కథ..
నల్లొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అక్కడి నుంచి ఓ స్కూటీ పై ఇద్దరూ ఓ జెట్ స్పీడ్ లో అమె వద్దనుంచి వెళ్ళారు. అంతే ఆమె మెడలోని గొలుసు మాయమైంది. అంతేబాధితురాలు తేరుకునే సరికి స్కూటీ చాలా దూరం వెళ్లిపోయింది. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు దంపతులను పట్టుకునేందుకు స్కూటీపై వెంబడించారు. ఇద్దరూ జెట్ స్పీడ్‌తో పారిపోయారు. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా అందులో ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్కూటీపై చైన్ స్నాచింగ్ చేయడం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. భలే దొంగలు సినిమాలో రియల్ లైఫ్ సీన్ క్రియేట్ చేయడంతో.. ఈ కిలాడీ ప్రేమికులను పట్టుకునేందుకు డీసీపీ దేవరకొండ రంగంలోకి దిగారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఆ ప్రేమ పక్షులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.
Rajasimha Tadinada: స్టార్ ప్రొడ్యూసర్ పై అనుచిత వ్యాఖ్యలు… రైటర్ పై పోలీస్ కేస్
తాజావార్తలు
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?