Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News There Is A Chance For Huge Changes In Trs After The Sankranthi Festival

గులాబీ పార్టీలో భారీ మార్పులకు కేసీఆర్‌ స్వీకారం

Published Date :December 12, 2021 , 10:54 am
By NTV WebDesk
గులాబీ పార్టీలో భారీ మార్పులకు కేసీఆర్‌ స్వీకారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం ఆదివారంతో రెండో పర్యాయం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

డిసెంబరు 16న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు కేసీఆర్‌ పరిపాలనలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరి సంక్రాంతి తర్వాత 2022లో పార్టీలో భారీ మార్పలు ఉండబోతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. IAS, IPS అధికారుల పనితీరు ఆధారంగా వారి ట్రాన్స్‌ఫర్లు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటే సంక్రాంతి తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండే అవకాశాలను కాదనలేం. ప్రభుత్వంలో 500 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి, పార్టీలో ధైర్యాన్ని పెంచాలని సీఎం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే, 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు, 2019లో లోక్‌సభ ఎన్నికలు, 2019 అక్టోబర్‌లో హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, 2020 చివరిలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా ముఖ్యమంత్రి తన రెండో పర్యాయంలో అనేక సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు, ఏప్రిల్ 2021లో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, అక్టోబర్ 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు ఈ మధ్యే స్థానిక సంస్థల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.

గత మూడేళ్లలో వరుస ఎన్నికల కారణంగా దశలవారీగా చాలా నెలల పాటు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రారంభించే నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుపడ్డాయి. మార్చి 2019లో కోవిడ్ మొదటి వేవ్, ఏప్రిల్ 2020లో రెండవ వేవ్‌ వల్ల నెలల పాటు లాక్‌డౌన్‌లు, వ్యాపార పరిమితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా.

ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చింది ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలో అన్ని ఎన్నికలు ముగిశాయి, టిఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన రెండేళ్ల పదవీకాలానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలని గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గత మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో చిన్నపాటి ఎదురుదెబ్బలు తప్ప.. డిసెంబర్ 2018 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఉత్సాహంతోనే పార్టీలో కీలక మార్పులకు స్వీకారం చుట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • kcr government
  • political news
  • TRS
  • trs politics

తాజావార్తలు

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

  • Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

  • Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

ట్రెండింగ్‌

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions