NTV Telugu Site icon

Jagadish Reddy: మాకు మేమే పోటీ..

Jagadeesh Reddy

Jagadeesh Reddy

దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి రోజు పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట‌ జిల్లా కేంద్రంలోని 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

మంచి నాగరిక సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వయసులో తక్కువ అయినా దేశంలో ఉన్నా మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అభివృద్ధిలో ఒకడుగు ముందే ఉందన్నారు. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వైకుంఠ ధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, ప్రతి నిత్యం మంచినీరు అందించే సురక్షితమైన మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు.

అన్నింటికి మించి హరితహారంతో తెలంగాణలో పచ్చదనం పరుచుకుందన్నారు. దేశంలోని ఇరవై గ్రామాల్లో ఏవి బాగున్నాయని లెక్కతీస్తే తెలంగాణలో 19 గ్రామాలు ఉంటాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని దాచిపెడదామని కనపడనీయకుండా చేద్దామని ప్రయత్నించే వాళ్లు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ప్రతి పథకం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు.

Kanna Laxminarayana : అమరావతి అభివృద్ధికి 2500 కోట్లు మోడీ ప్రభుత్వం ఇచ్చింది