SI, Constable Results: పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని OC సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు. అయితే.. ఈ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో EWS అభ్యర్థులతో పాటు ఇతర వర్గాల వారికి అన్యాయం జరిగిందని, SC, ST, BC అభ్యర్థులకు కటాఫ్ తగ్గించిన ప్రభుత్వం EWS అభ్యర్థులకు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ఈ ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వలన చాలామందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
Read also:Diwali Special: దీపావళి ఎలా వచ్చింది..? ఏమిటా కథ..?
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు 21న(శుక్రవారం) విడుదలైన విషయం తెలిసిందే.. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. ఇక, తదుపరి దశలో ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించినవారు, అనర్హుల వివరాలు 21న(శుక్రవారం) అర్ధరాత్రి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, లాగిన్ ఐడీ ద్వారా అభ్యర్థులు ఈ వివరాలను పొందవచ్చని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై, ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్-2 అప్లికేషన్లను అప్లోడ్ చేయాలని TSLPRB సూచించింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఫిజికల్ టెస్టులు ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయని, వాటి ఫలితాలనే అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అప్లై చేసుకోవాల్సిన సైట్: www.tslprb.in అని పేర్కొన్నారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని OC సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేయడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
LIVE : పాక్ పై పేలిన విరాట్ వాలా.. మగాడ్రా బుజ్జా..!