Recorded Video: హైదరాబాద్ చంపాపేటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఓ యువతి న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేయడం వాస్తవమే అయినప్పటికీ అవి నిజమైన వీడియో కాల్స్ కాదని తెలంగాణ సైబర్ పోలీసులు తేల్చారు. సైబర్ నేరగాళ్లు సదరు ఉద్యోగిని పిలిచి ముందుగా రికార్డ్ చేసిన న్యూడ్ వీడియోను చూపించారని, అదే సమయంలో మరో మహిళతో వాయిస్ ఓవర్ ద్వారా అతడిని ప్రలోభపెట్టి మొత్తం రికార్డు చేసి, ఆ వీడియోను అందరికీ పంపాలని ఉద్యోగిని బెదిరించి డబ్బు దోచుకున్నాడని తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని, దీనికి సంబంధించిన అన్ని వీడియోల్లోనూ అదే యువతి కనిపించడంతోపాటు ఎక్కడా లిప్ సింక్ కాకపోవడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు.
Read also: Sunday Funday: హమ్మయ్య టైం వచ్చేసింది.. పదండి ట్యాంక్ బండ్ కెళ్లి ఎంజాయ్ చేద్దాం
అశ్లీల (పోర్న్) వీడియోలు చూసే అలవాటున్న వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్‌లకు స్పందించవద్దని, అలాంటి వీడియో కాల్‌లకు భయపడి ఎవరికీ డబ్బులు పంపవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ వల్ల ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు లేదా 1930 ఫోన్ నంబర్ కు సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Inappropriate posts on Secretariat: సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్ కు చెందిన వ్యక్తి అరెస్ట్