IT Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. ఈనెల 22న విచారణకు రావల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్ గా సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్‌ఎస్ నేతల నివాసాలు, వ్యాపారాల నుంచి అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి కంచర్ల రామా కృష్ణ రెడ్డితో పైళ్ల శేఖర్ రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని తెలిపారు. కావాలనే ముడు రోజుల పాటు ఐ.టి అధికారులు కాలయాపన చేశారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐ.టి అధికారుల తీరు ఉందని అన్నారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై సోదాలు జరిగాయని తెలిపారు. నా నివాసంలో ఏం కనిపించలేదని అన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నా సతీమణి బెంగుళూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని స్పష్టం చేశారు. దానికి సంబందించిన డాక్యుమెట్స్ తీసుకున్నారుని తెలిపారు. ఆదాయ పన్ను చెలిస్తున్ననని స్పష్టం చేశారు. కావాలనే నా పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఐ.టి సోదాలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసని మండిపడ్డారు. నాకు ఈనెల 22న గురువారం రమ్మని ఐ.టి అధికారులు నోటీసులు అందజేసారని తెలిపారు. నేను నిజాయితీగా ఉన్నారని, నా నియేజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఐ.టి సోదాలు తరువాత నాకు అధిష్ఠానం నుండి అధ్యక్షుల నుండి పార్టీ నుండి ఎలాంటి కాల్స్ రాలేదని అన్నారు. గత మూడు రోజులుగా నాపై కుట్ర పూరితంగానే IT రైడ్స్ జరిగాయని అన్నారు. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని తెలిపారు. IT రైడ్స్ మొదటి రోజే ఒక గంటన్నర లోనే పూర్తి అయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నది అవాస్తవం మని తెలిపారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, IT అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారని అన్నారు. నాకోసం మూడు రోజులుగా ఇక్కడే వున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం పోతే.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!